తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచిపోయే చిత్ర రాజం శంకరాభరణం సినిమా.మన సినిమా సంగీత సత్తాను దేశ వ్యాప్తం పరిమళింపజేసిన చిత్రం.
ఏ మాత్రం జనాలకు తెలియని సోమయాజులు అనే యాక్టర్ ని ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ.దర్శకుడిగా కళాతపస్వి కె.విశ్వనాథ్ తో పాటు సంగీత దర్శకుడిగా కెవి మహదేవన్ కీర్తిని ఓ రేంజికి తీసుకెళ్లిన సినిమా.అంతేకాదు ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడిన ప్రతి పాట ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమాలో పాటలు పాడేందుకు బాలు మొదట్లో భయపడ్డాడట.ఇంతకీ తన భయానికి కారణం ఏంటనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సినిమాలో పాడటానికి ముందే ఎస్పీ బాలు.ఆరేసుకోబోయి పారేసుకున్నాను.ఆకుచాటు పిందె తడిసె లాంటి సూపర్ హిట్ పాటలు పాడారు.ఆయన గాత్రంలోని మాధుర్యం తెలిసిన విశ్వనాథ్, మహదేవన్ ఈ సినిమాలోని పాటలను తన చేతనే పాడించాలి అనుకున్నారు.
కానీ ఈ సినిమా పాటలను తను పాడలేనని చెప్పాడట.ఈ సినిమాలోని కీర్తనలు, పాటల ట్యూన్లు విని నా వల్ల కాదు అన్నాడట.
మరో మంచి గాయకుడిని చూసుకోవాలన్నాడట.బాలు మాటతో విశ్వనాథ్, మహదేవన్ ఆశ్చర్యపోయారట.
నువ్వు పాడగలవు అని వారు చెప్పినా బాలు వెనుకడుగు వేశాడట.చరిత్రలో నిలిచిపోయే ఈ పాటలు పాడటం తనకు సాధ్యం అయ్యే పనికాదు అనుకున్నాడట.
అందుకే నో చెప్పి అక్కడి నుంచి వెనుతిరిగాడట.
అయినా.తన తోనే ఆ పాటలు పాడించాలని విశ్వనాథ్ అనుకున్నాడట.పాడిస్తానని మహదేవన్ తో చెప్పాడట.అనుకున్నట్లుగానే బాలును మళ్లీ పిలిపించి పాడించారట.తొలిపాట దొరకునా ఇటువంటి సేవతో మొదలైన ఈ పాట ప్రవాహం ఒక్క పాట మినహా మిగతావన్నీ పూర్తయ్యయే వరకు కొనసాగిందట.
కీర్తనలు కూడా బాలూనే ఆలపించాడట.సినిమా విడుదల అయ్యాక.
ఈ సినిమా సంగీతానికి తెలుగు జనం దాసోహం అన్నారట.ఈ పాటలు చరిత్రలో నిలిచిపోయాయి.
బాలుకు జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డును తెచ్చి పెట్టాయి.