ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ దిగజారి మాట్లాడుతున్నారన్నారు.
ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొందరు వాలంటీర్ల గురించే మాట్లాడారని తెలిపారు.
కానీ జగనే వాలంటీర్ల అందరి పరువు తీశారని విమర్శించారు.దమ్ముంటే సింగిల్ గా రావాలని జగన్ అంటున్నారన్న సోమిరెడ్డి వైఎస్ఆర్ గతంలో దమ్ములేకనే పొత్తుతో వెళ్లారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేశ్, బాలయ్య, పవన్ ను తిట్టడానికే వెంకటగిరిలో జగన్ బహిరంగ సభ పెట్టారని దుయ్యబట్టారు.