బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ( CM kcr )తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన పట్టు నిరూపించుకుంటున్నారు.కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు.
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా కేటీఆర్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఖచ్చితంగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా గా చెబుతున్నారు.
కెసిఆర్ కంటే ఎక్కువ స్థాయిలో పార్టీ వ్యవహారాలపై కేటీఆర్ ఫోకస్ చేస్తున్నారు.అయితే అకస్మాత్తుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వచ్చే ఎన్నికల్లో మీ దయ ఉంటే గెలుస్తా లేకుంటే ఇంట్లో కూర్చుంటానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అసలు కేటీఆర్ ఈ రకంగా ఎందుకు మాట్లాడారు అనేది ఆసక్తికరంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా సిరిసిల్లలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు.ఈ సందర్భంగా ప్రతిపక్షాల పైన తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు .ప్రతిపక్ష నాయకులు ఓట్లు అడగడానికి వస్తే ప్రభుత్వ పథకాలు చెప్పి నిలదీయాలని సూచించారు బీసీ బంద్ లోను కాదని , గ్రాంట్ మాత్రమేనని , తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ప్రతిపక్షాలు చెప్తేనే పెన్షన్ పెంచలేదని, రాబోయే రోజుల్లో మరోసారి పెన్షన్ ను పెంచే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు.రాబోయేది మళ్లీ డిఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్( KTR ) పేర్కొన్నారు.అయితే గెలుపు పై ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్న కేటీఆర్ తన విషయంలో మాత్రం ఈ రకమైన కామెంట్స్ చేయడం, మీ దయ ఉంటే గెలుస్తా లేకపోతే ఇంట్లో కూర్చుంటానంటూ మాట్లాడడం వెనుక కారణాలు ఏమిటి అనేది అందరికీ ఆసక్తికరంగా మారాయి.
బిఆర్ఎస్( BRS party ) వర్గాలు సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై విశ్లేషణ చేసుకుంటున్నాయి.కేటీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ విధంగా వ్యాఖ్యానించారు అనేది తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించిన కేటీఆర్ ఇప్పుడు గెలుపోటముల అంశాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.