నేడు లోక్‎సభలో రాహుల్ ప్రసంగంపై రాని స్పష్టత

కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్‎సభలో చర్చ ఇవాళ కూడా కొనసాగనుంది.అయితే ఈ చర్చపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై స్పష్టత కరువైంది.

 There Is No Clarity On Rahul's Speech In The Lok Sabha Today-TeluguStop.com

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో ఉన్నప్పుడే అవిశ్వాసంపై మాట్లాడాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడనున్నారు.

అటు బీఆర్ఎస్ తరపున నామా నాగేశ్వర రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉండగా బీజేపీ తరపున స్మృతీ ఇరానీ, నిర్మలా సీతారామన్, బండి సంజయ్ లు మాట్లాడే అవకాశం ఉంది.కాగా ఇటీవల మణిపూర్ లో జరిగిన హింసపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube