టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) నటించిన తాజా చిత్రం భోళా శంకర్.ఇందులో తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఇందులో కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను కీలకపాత్రలలో నటించిన విషయం తెలిసిందే.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకులు ముందుకు రానుంది.
విడుదల తేదీకి మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా భోళా శంకర్( Bhola Shankar ) టీమ్ మొత్తం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అందులో శ్రీముఖి, చిరంజీవి, కీర్తి, తమన్నా, గెటప్ శ్రీను, డైరెక్టర్ మెహర్ రమేశ్, సుశాంత్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.అయితే ఈ ఇంటర్వ్యూలో చిరు తన కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్వించారు.ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ.కీర్తి వాళ్ల మదర్ మేనక నాకు మంచి ఫ్రెండ్.అదే అనుబంధం కీర్తితో కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ మూవీలో చెల్లెలి సెంటిమెంట్( Sister Sentiment ) చాలా కొత్తగా బలంగా ఉంటుంది.తన నటనతో కీర్తి నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లింది.
ఇక కీర్తి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.తను మహానటి.
తన ముందు జాగ్రత్తగా లేకపోతే తినిపారేస్తుంది.
తమన్నా( Tamannaah )తో చేసే డాన్సులను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.అలాగే పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసే సీన్ కూడా ఆకట్టుకుంటుంది.ఆ సందర్భాన్ని చాలా ఎంజాయ్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా సినిమా ప్రమోషన్స్ సమయంలో చిరంజీవి కాస్త ఓవర్ చేస్తున్నాడని, కూతురు వయసు ఉండే కీర్తి సురేష్( Keerthy Suresh ) తో కాస్త చనువుగా ఉండడంతో అది చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు.మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో హీరోయిన్లతో అలా కామెడీలు అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.