జగన్ తో మీటింగ్ కి ప్రభాస్, రాజమౌళి వెళ్లినందుకు ప్రత్యేక ఫలితం దక్కింది

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తో సినీ ప్రముఖుల భేటీకి టాలీవుడ్ నుండి చిరంజీవి తో పాటు మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి హాజరైన విషయం తెలిసిందే.జగన్ తో ప్రభాస్ మరియు రాజమౌళి భేటీ అయిన నేపథ్యంలో వారికి మంచి ప్రయోజనం దక్కింది అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.100 కోట్లు ఆపై బడ్జెట్ ఖర్చు చేసి నిర్మించిన సినిమాలకు ఏపీలో 5వ షో కు అనుమతిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Why Ap Govt Give Special Permeation For Radhesyam And Rrr Movies , Ap Govt ,-TeluguStop.com
Telugu Ap, Chiranjeevi, Mahesh Babu, Perni Nani, Prabhas, Radheshyam, Rajamouli,

రాధేశ్యామ్‌ మరియు ఆర్‌ ఆర్ ఆర్ సినిమాలు ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరగని కారణంగా 5వ షో ఉండక పోవచ్చు అన్నారు.కాని వందకోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మాణం అవ్వడం వల్ల ఆ సినిమాలకు అనుమతిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.ఆ రెండు సినిమాల వరకు ఈ జీవో విషయంలో ఉపశమనం ఇవ్వబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇకపై రాబోతున్న ప్రతి సినిమా కూడా ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకుంటేనే ప్రత్యేక షోలకు అనుమతిస్తామని మంత్రి తెలియజేశారు.ఈ రెండు సినిమాలకు ఎందుకు ఉపశమనం ఇవ్వడం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆ నిర్ణయం వెనక కారణం రాజకీయం అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ విషయంపై నెటిజన్ కామెంట్ చేస్తున్నారు.

జగన్తో భేటీకి ప్రభాస్ మరియు రాజమౌళి హాజరయ్యారు.ఆ కారణంగానే ఈ రెండు సినిమాలకు జీవో నుండి ఉపశమనం వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది.

రాధేశ్యామ్‌ కోసం ఆగమేఘాల మీద జీవో తీసుకు వచ్చారని కూడా అంటున్నారు.ప్రభాస్ రాధేశ్యాం సినిమా విషయంలో  ఏపీ ప్రభుత్వం నుండి వచ్చిన సానుకూల స్పందన తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  అక్కడ భారీ ఎత్తున వసూళ్లు నమోదు కావడం ఖాయమని క్లారిటీ వచ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube