తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన చేస్తున్న సినిమాలు వరుసగా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలనే ఉద్దేశ్యం తోనే ఆయన ఏజ్ కు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందు దూసుకెళ్తున్నాడు.
ఇక వెంకటేష్ అప్పట్లో వరుస డిజాస్టర్ లని ఎదుర్కొన్నాడు.కానీ దృశ్యం ( Drushyam ) లాంటి ఒక అద్భుతమైన సినిమాని తీసి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందాడు.
ఇక దాంతో ఆయన వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.స్టార్ హీరోలు అందరు కూడా వాళ్ళ ఏజ్ కు తగ్గ పాత్రను చేయడానికి కొంచెం ఇబ్బంది పడినప్పటికీ

వెంకటేష్ మాత్రం కథ బాగుంటే ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయడానికి సిద్ధంగా ఉంటాడు అనేది మనం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం…ఇక అందులో భాగంగానే ఇప్పుడు వెంకటేష్, రవితేజ( Venkatesh Raviteja ) ఇద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా ఎవరు ఉంటారు అనేది పక్కన పెడితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మైత్రి వాళ్ళు రీసెంట్ గా రవితేజ, గోపీచంద్ కాంబోలో రావలసిన సినిమాని హోల్డ్ లో పెట్టారు.దానికి బదులు గా రవితేజతో( Raviteja ) వాళ్ళు చేయాల్సిన ఒక సినిమా బ్యాలెన్స్ గా ఉండడంతో వెంకటేష్, రవితేజలను పెట్టి

ఈ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రం ఎవరు అనేది ఇంకా ఫైనల్ గా తెలియదు కానీ వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే ప్రేక్షకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఇద్దరు కూడా కామెడీలో కింగ్స్ అనే చెప్పాలి… అందుకే వీళ్ళతో ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే మైత్రి వాళ్ళు అలాంటి సబ్జెక్ట్ ని రెడీ చేయించినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కి డైరెక్టర్ ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి…
.