ఏపీ సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.ఈ మేరకు గత ప్రభుత్వం డేటా సేకరణపై సీఎం జగన్ ప్రసంగాన్ని పవన్ ట్వీట్ చేశారు.
డేటా ప్రైవసీ చట్టాలు మీరు సీఎంగా ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటాయన్నారు.వాలంటీర్లకు బాస్ ఎవరని జనసేనాని ప్రశ్నించారు.
ఏపీ ప్రజల పర్సనల్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారో చెప్పాలన్నారు.కాగా వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు డేటాను ఏ విధంగా సేకరిస్తారన్న పవన్ కల్యాణ్ డేటా సేకరించే అధికారం వాలంటీర్లకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.