ఈరోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు మారుతి ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆయన రెండవ సినిమాగా బస్టాప్ అనే సినిమా చేశాడు అది కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడం ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు డైరెక్టర్ మారుతి( Director Maruti )…ఇక నాని తో చేసిన బలే బలే మగాడివోయ్( Bale Bale Magadivoy ) సినిమాతో ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన స్టామినా ఏంటో అందరికీ తెలిసేలా చేశాడు.
ఆ తరువాత వెంకటేష్( Venkatesh ) తో బాబు బంగారం లాంటి సినిమా చేసినప్పటికీ అది పెద్దగా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి.ఇక అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )తో ఒక ఫుల్ మాస్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది… దాని కోసమే ఒక సూపర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నారట అయితే ఇప్పుడు ఉన్న స్టోరీ బాగున్నప్పటికీ చిరంజీవి కొన్ని మార్పులు చెప్పారట దాంతో ఆ స్టోరీ ని రిపైర్ చేసే పనిలో ఉన్నాడు మారుతి అలాగే ప్రభాస్ తో చేస్తున్న రాజా డీలక్స్ సినిమాతో మంచి హిట్ కొడతాను అని చాలా ధీమా గా ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ప్రభాస్( Prabhas ) సినిమా హిట్ అయితేనే మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వస్తుంది లేకపోతే చిరంజీవి ఆయనకి అవకాశం ఇవ్వడం కష్టం అనే చెప్పాలి…మారుతి కూడా తన ఆశలన్నీ ప్రభాస్ సినిమా మీదే పెట్టుకున్నట్లు తెలుస్తుంది… అందుకే ఈ సినిమా కి సంభందించిన చిన్న విషయం లో అయిన కూడా మారుతి స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది…