Hardest Job In The World : ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఉద్యోగం ఇదే.. ఏం చేయాలో తెలిస్తే వణుకు పుడుతుంది..!

ఈ ప్రపంచంలో నిద్రపోవడం, ఆట బొమ్మలతో ఆడుకోవడం వంటి తెలికైన జాబ్స్ మాత్రమే కాదు, ఆకాశాన్నంటే టవర్లకు లైట్ బల్బులను అమర్చడం, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో డ్రైవ్ చేయడం వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి.అయితే వీటన్నిటిలో ఒక ఉద్యోగం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైనదిగా నిలుస్తోంది.

 What Is Vymorozka Workers One Of The Hardest Jobs In The World-TeluguStop.com

ఇంతకీ ఏంటా ఉద్యోగం? ఆ ఉద్యోగంలో ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అత్యంత చల్లటి ప్రదేశాలలో షిప్‌యార్డ్‌లలో( Extreme Cold Shipyards ) శీతాకాలంలో పనిచేసే ఉద్యోగమే ఈ ప్రపంచంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం.

ఈ చల్లని ప్రదేశాలలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువగా ఉంటుంది.ఇక్కడ వర్క్ చేసే వారిని వైమోరోజ్కా కార్మికులు( Vymorozka Workers ) అని పిలుస్తారు.

ఈ పని చేసే వారిని చాలా ధైర్యవంతులు, బలవంతులుగా పరిగణిస్తారు.

గాలి చాలా చల్లగా ఉన్న ప్రదేశంలో పని చేయడం గురించి వల్ల చర్మం బాగా దెబ్బతింటుంది.

శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది.వ్యామోరోజ్కా కార్మికులు ఉష్ణోగ్రత -50 ° C (-58 ° F) కంటే తక్కువగా ఉండే ప్రదేశాలలో పని చేస్తారు.

వైమోరోజ్కా కార్మికులు ఈ శీతల ప్రదేశాలలో సంవత్సరంలో సగం కాలం వరకు పని చేస్తారు, శీతాకాలం వచ్చి చాలా కాలం పాటు ఉంటుంది.వారు సైబీరియా,( Siberia ) నార్వే,( Norway ) కెనడా( Canada ) వంటి ప్రదేశాలలో పని చేస్తారు, ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది.

Telugu Canada, Challenges, Extreme, Hardest Job, Norway, Nri, Siberia, Toughest

ఈ కార్మికులు వెచ్చగా ఉంచే అనేక బట్టలు ధరించే పని చేస్తారు కానీ ఆ బట్టలు చలిని ఆపలేవు.ఆ చలిలో చాలా కష్టమైన అనేక పనులను చేయాల్సి ఉంటుంది.చలికి పని చేయడం ఆగిపోయిన యంత్రాలను సరిచేయాలి, ఆ సమయంలో తిమ్మిరితో బలహీనంగా మారిన చేతులను ఉపయోగించాలి.ఆ యంత్రాలను సరి చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసిన చేతులకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.

Telugu Canada, Challenges, Extreme, Hardest Job, Norway, Nri, Siberia, Toughest

వైమోరోజ్కా కార్మికులు చాలా చల్లని ప్రదేశంలో పనిచేసినప్పటికీ, వారు మనసులో వెచ్చని అనుభూతిని కలిగి ఉంటారు.ఎందుకంటే ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు.చీకటిగా ఉన్నా, చల్లగా ఉన్నా సంతోషంగా ఉంటారు.వైమోరోజ్కా కార్మికులు అద్భుతమైన వ్యక్తులు.వారు చాలా చల్లని ప్రదేశాలలో పని చేయగలరు, నివసించగలరు, చాలా మంది వ్యక్తులు చేయలేని పనులను వారు చేయగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube