ఒక సినిమా మంచి విజయం సాధించాలంటే దానికి కథ, కథనం ఎంత ముఖ్యమో మ్యూజిక్( Music ) కూడా అంతే ముఖ్యం… ఎందుకంటే ఒక సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి గానీ ఆ సినిమా ఎక్కువగా జనాలకి రీచ్ కావాలన్న అది ఆ సినిమా లో ఉన్న సాంగ్స్ వల్లే సాధ్యం అవుతుంది.అందుకే సినిమా డైరెక్టర్ ఆ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ను( Music Director ) తీసుకునేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొని ఆయన చేత మంచి మ్యూజిక్ రాబట్టు కోవాల్సి ఉంటుంది…అయితే మ్యూజిక్ ఒకటే కాదు సినిమాలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా విజయం లో చాలా కీలక పాత్ర వహిస్తుంది అనే విషయం రీసెంట్ గా వచ్చిన జైలర్ సినిమాని( Jailer Movie ) గమనిస్తే మనకునార్థం అవుతుంది…ఈ సినిమా లో హీరోయిజం ఎలివేట్ కావాలంటే దానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అది సరిగ్గా లేకపోతే డైరెక్టర్ గానీ, హీరో గానీ ఎంత కష్టపడి ఆ సీన్ తీసిన కూడా అది వృదానే అవుతుంది…
అయితే అప్పట్లో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన హరీష్ జైరాజ్( Harris Jayaraj ) తన మ్యూజిక్ తో చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ అయ్యాయి కానీ ఆయన తెలుగు లో చేసిన సైనికుడు, మున్నా, ఆరెంజ్ లాంటి సినిమా లు మ్యూజికల్ గా హిట్ అయినప్పటికీ సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి అయితే ప్రస్తుతం హరీష్ జైరాజ్ కి సినిమాలు ఎక్కువ గా రావడం లేదు ఒకప్పుడు తమిళం లో వచ్చిన పెద్ద సినిమాలకి ఆయనే మ్యూజిక్ ఇచ్చేవాడు, కానీ ప్రస్తుతం ఆయనకి ఎక్కువ గా అవకాశాలు రావడం లేదు నిజానికి హరీష్ జైరాజ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు తన సాంగ్స్ తో కుర్రకారుని ఒక ఊపు ఉపేసాడు…
అయితే ఆయన కి సినిమాలు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం లో కొంచం ఎక్కువ టైం తీసుకుంటాడట, అలాగే ఆయన ఒక సినిమా కోసం తీసుకునే రెమ్యూనరేషన్( Remuneration ) కూడా చాలా ఎక్కువ గా ఉండటం తో డైరెక్టర్లు అందరూ కూడా కొత్త వాళ్ళని తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…ఇక అందుకే ఆయనకి ఎక్కువ గా అవకాశాలు రావడం లేదని తెలుస్తుంది దానికి తోడు తమిళం లో ప్రస్తుతం అనిరుధ్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుండటం తో ఆయనకి ఎక్కువ క్రేజ్ పెరిగింది దానితో ఆయనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు…