తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీతం అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలలో ఒకటి ఎస్ పీ బాలసుబ్రమణ్యం( SP Balasubramaniam).సుమారుగా నాలుగు దశాబ్దాల పైన నుండి ఆయన సినిమాల్లో పాటలు పాడుతూ వచ్చాడు.
తెలుగు , హిందీ, తమిళం , మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి ఎస్ పీ బాలసుబ్రమణ్యం సుమారుగా 55 వేల పాటలు పాడాడు.కరోనా సోకి ఆయన చనిపోయి ఉండకపోయి ఉంటే భవిష్యత్తులో ఆయన లక్ష పాటలు పాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమకి బాగా కనిపిస్తుంది.ఏ హీరో కి అయిన సరిపోయేటట్టు తన గాత్రం అందించే అలవాటు ఉన్న ఎస్ పీ బాలసుబ్రమణ్యం తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుంటాడు.
ఎంత డబ్బులు ఇచ్చినా కొన్ని పాటల జోలికి వెళ్ళడు.ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిన , ఎంత పెద్ద సూపర్ అడిగినా ఆయన కొన్ని పాటలు పాడడు.

ఉదాహరణకి గతం లో మోహన్ బాబు(Mohan Babu) తో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.ఎస్ పీ బాలసుబ్రమణ్యం కి మోహన్ బాబు ఎంతో ఆప్త మిత్రుడు, మోహన్ బాబు బాలసుబ్రమణ్యం ని తన సొంత కుటుంబసభ్యుడిగా చూస్తాడు, బాలసుబ్రమణ్యం కూడా మోహన్ బాబు ని అలాగే అనుకునేవాడు.అయితే అప్పట్లో మోహన్ బాబు మరియు కె రాఘవేంద్ర రావు(K Raghavendra Rao) దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కుతుంది.ఆ సినిమా కి పాటలు మొత్తం వేటూరి సుందరరామ్మూర్తి(Vethuri Sundararammurthy) గారు రాసారు.
అయితే అప్పట్లో వేటూరి గారు బూతుల పాటలు చాలా అందంగా ఉండేట్టు రాసేవారట.మోహన్ బాబు – రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కే సినిమాలో అలాంటి పాటలు రెండు మూడు ఉన్నాయట.
ఎస్ పీ బాలసుబ్రమణ్యం ని ఒక పాట పాడమని రాఘవేంద్ర రావు రిక్వెస్ట్ చేస్తే, ఇలాంటి బూతు పాటలు నేను పాడలేను క్షమించండి సార్ అన్నదాత బాలసుబ్రమణ్యం.

ఎంత రిక్వెస్ట్ చేసిన ఎస్ పీ బాలసుబ్రమణ్యం ఈ పాటలు పాడడానికి ఒప్పుకోలేదట.ఈ విషయాన్నీ మోహన్ బాబు కి రాఘవేంద్ర రావు చెప్పగా, మీరు ముందే నాకు నేరుగా ఈ విషయం చెప్పి ఉంటే మీ దాకా రాణించేవాడిని కాదు కదా, బాలసుబ్రమణ్యం నేను చెప్తే పాడుతాడు, నేను ఒప్పిస్తాను మీరు నిశ్చింతగా ఉండండి అని అన్నాడట మోహన్ బాబు.ఆయన మాటలపై రాఘవేంద్ర రావు చాలా నమ్మకం ఉంచాడట.
అయితే మోహన్ బాబు చెప్పినా కూడా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇలాంటి పాటలు పాడను అని తెగేసి చెప్పాడట,నువ్వు నా ఆప్త మిత్రుడివి నీకోసం ఏదైనా చేస్తాను, కానీ నేను నమ్ముకున్న కొన్ని సిద్ధాంతాలను నా ప్రాణాలు పోయిన వదలను నన్ను క్షమించి మిత్రమా అన్నాడట.అందుకు మోహన్ బాబు కి చాలా కోపం వచ్చిందట, సుమారుగా పదేళ్లు బాలసుబ్రమణ్యం తో మాట్లాడలేదని టాక్.
ఇదంతా చూస్తుంటే ఎస్ పీ బాలసుబ్రమణ్యం తానూ నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లాడని అర్థం అవుతుంది.