2002లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా( Aadi Movie ) ద్వారా సినిమా రంగానికి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు వీవీ వినాయక్.చిన్నతనం నుంచి సినిమా తప్ప మరొకటి తెలియదు.
ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అయిపోవాలని కలలు కనేవాడు.విడుదలైన ప్రతి సినిమా చూడటం తప్ప మరొక పనిలేదు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లు అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టాడు వినాయక్.సినిమాల్లో దర్శకుడుగా సంపాదించిన డబ్బులు మొత్తం మళ్లీ సినిమా ఇండస్ట్రీ కోసమే ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు.
ఇప్పటి వరకు 18 సినిమాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ ఇప్పుడు నటుడుగా కూడా మారి సీనయ్య అనే ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
అయితే చాలామంది వినాయక్( VV Vinayak ) గురించి తెలిసిన వాళ్ళు అతనికి కాస్త పిచ్చి ఉంది అనుకుంటారట.దానికి గల కారణం సినిమాల్లో కోట్లకు కోట్లు డబ్బు సంపాదించారు.కానీ వాటిని ఏం చేశారో తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోకుండా ఉండరు.
ఇప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం కూడా సినిమా థియేటర్స్ కట్టుకోవడానికి మాత్రమే వినియోగించారట.అలా రాజమండ్రిలో సామర్లకోటలో విజయవాడలో దాదాపు 70 నుంచి 80 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి థియేటర్స్ మల్టీప్లెక్స్( Multiplex ) కడుతూ ఉన్నారట.
ఇప్పటికీ కూడా వస్తున్న ప్రతి రూపాయిని సినిమా థియేటర్స్ కొనడానికి మాత్రమే వినియోగిస్తాడట వినాయక్.
అందుకు గల కారణం వేరే ఏదీ లేదు తనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు.ఏదో ఒక రోజు దర్శకుడుగా రిటైర్మెంట్ అయిన తర్వాత సినిమా థియేటర్స్( Movie Theaters ) లో కూర్చుని సినిమా చూడటం మాత్రమే పనిగా పెట్టుకోవాలనుకున్నాడట అలా రోజు చూడాలంటే డబ్బు కావాలి కాబట్టి థియేటర్స్ కొనుక్కొని అక్కడే కూర్చుంటాడట.డబ్బుకు డబ్బు ఆదాయానికి ఆదాయం.
అలాగే తనకు కావలసిన సినిమా ఎప్పుడు తనతోనే ఉంటుంది.అలా థియేటర్స్ కొంటూనే ఉన్నాడు.
ఇదే డబ్బు వేరే రంగంలో లేదా ఏదైనా ఫ్యాక్టరీస్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటే కోట్ల రూపాయలు రిటర్న్స్ వచ్చేవి అని చుట్టాలు అంతా తను పిచ్చివాడిలా చూస్తున్నారని కానీ తన ఇష్టానికి ఇలాగే చేస్తానంటూ చెబుతున్నాడు వినాయక్.