టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.ఎటువంటి అండదండలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి ఈతరం నటులకు ఎంతో ఆదర్శనీయం.
దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలుతున్న చిరంజీవి అంటే సినిమా ప్రేక్షకులకు అమితమైన అభిమానం.ఎంత అభిమానం అంటే ఆయన కొణిదెల వంశాన్ని కూడా ఆరాదించేటంత.
అవును, ఆ ఫామిలీ నుండి ఈపాటికే ఓ డజనుకు పైగా హీరోలు రావడం, ఇక్కడ జండా పాతడం అందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే ముఖ్యంగా కొడుకు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కాగా… మేనల్లుడు అయినటువంటి అల్లు అర్జున్( Icon Star Allu Arjun ) ఇక్కడ ఐకాన్ స్టార్ గా ఎదిగారు.
ఏ రంగంలో అయినా వివిధ వ్యక్తుల మధ్య కాంపిటేషన్ అనేది చాలా అవసరం.అపుడే మనిషి ఎదగగలుగుతాడు.కానీ ఇక్కడ ఒకటే ఫ్యామిలీలో సదరు హీరోల మధ్య మంచి టఫ్ కాంపిటీషన్ కనబడుతుంది.అయితే అది ఆరోగ్య కరంగానే ఉంటుంది, ఉండాలి కూడా.అదే శృతి మించితే ఒకే కుంటుంబంలో అయినా కూడా పొరపొచ్చాలు రావడం పరిపాటి.ఇక అసలు విషయంలోకి వెళితే… మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ ఎంతలా కష్టపడతాడో, మెగా మేనల్లుడిగా అల్లు అర్జున్ కూడా అదే స్థాయిలో కష్టపడతాడు అనే విషయం అందరికీ విదితమే.
ఇక్కడే మెగా కుటుంబం అభిమానులు, అల్లు కుటుంబం( Allu Family ) అభిమానులు వేరు పడ్డారు.దాంతో మెగా వార్ షురూ అయింది.
లోగుట్టు పెరుమాళ్ళకెరుక గానీ మెగాఫ్యామిలీకి( Mega Family ), అల్లు ఫ్యామిలీకి గొడవలు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి.అవి నేటికీ కంటిన్యూ కావడం దురదృష్టకరం.మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరో మా హీరో రామ్ చరణ్ అని మెగాభిమానులు అంటుంటే, మరోవైపు అదేం కాదు… మెగాస్టార్ తర్వాత ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరో అల్లు అర్జున్ అని బల్ల గుద్ది మరీ ఊదరగొడుతున్నారు అల్లు వారి ఫాన్స్.మరీ ముఖ్యంగా నిన్న బన్నీ బర్త డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 సినిమా( Pushpa 2 ) టీజర్ చూసిన తర్వాత ఆ సో కాల్డ్ జనాలు మెగాస్టార్ ప్లేస్ ను రీప్లేస్ చేసేది కచ్చితంగా మా అల్లు అర్జున్ అంటూ తెగ పొగిడేస్తూ పోస్టులు పెడుతున్నారు.
మెగాస్టార్ తర్వాత ఆస్థానాన్ని అందుకునే క్యాప్యాబలిటి కేవలం అల్లు అర్జున్ కే ఉంది అంటూ పొగిడేస్తున్నారు.మరోపక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగాస్టార్ తర్వాత అటువంటి స్థాయి అందుకునే హక్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Mega Power Star Ram Charan ) కి ఉంది అంటూ వాదిస్తున్నారు.