Vunnadhi Okate Zindagi Movie Review

చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ
బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : స్రవంతి రవికిషోర్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
విడుదల తేది : అక్టోబర్ 27, 2017
నటీనటులు : రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ తదితరులు

 Vunnadhi Okate Zindagi Movie Review-TeluguStop.com

కథలోకి వెళితే :

అభి (రామ్ పోతినేని), వాసు (శ్రీవిష్ణు) చిన్ననాటి నుంచి చెడ్డి దోస్తులు.వీరి స్నేహం రక్తసంబంధం కన్నా, ప్రేమబంధం కన్నా తక్కువ కాదు.

అందమైన వీరి స్నేహ జీవితం మహా (అనుపమ) వచ్చిన తరువాత ఒడిదుడుకులని ఎదుర్కుంటుంది.అవేంటో, ఆ సమస్యలని దాటి వీరి స్నేహ బంధం ఎలా నిలబడిందో, ఈ కథలో మేఘన (లావణ్య) తీసుకొచ్చిన మార్పులు ఏమిటో తెర మీదే చూడాలి

నటీనటుల నటన :

కొంచెం పచ్చిగా మాట్లాడితే, ఓ కమర్షియల్ హీరోగా తప్ప, ఒక నటుడిగా రామ్ ఇంతవరకు తనని తానూ నిరూపించుకోలేదు.అలాంటి సినిమాలు పెద్దగా అటెంప్ట్ చేయలేదు.కాని హైపర్ దెబ్బకి హీరోబలం కంటే కథాబలం ముఖ్యం అని తెలుసుకున్న రామ్, ఇందులో నిజంగా హానెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు.

నటించేటప్పుడు పాత్రలా బెహేవ్ చేయడు, నటించెందుకే ప్రయత్నిస్తాడు అని రామ్ మీద మరో కంప్లయింట్ ఉండేది.కాని ఈ సినిమాలో రామ్ గీత దాటలేదు.తనని తను బాగా అదుపు చేసుకొని అభినయించాడు.మరో గొప్ప విషయం ఏమిటంటే, కథ కోసం శ్రీవిష్ణు పాత్ర ఇంపార్టెన్స్ తగ్గించలేదు.

ఇక అప్పట్లో ఒకడుండేవాడు తరువాత శ్రీవిష్ణు మరోసారి మంచి పాత్ర దక్కించుకొని, దానికి న్యాయం చేసాడు.అనుపమ ఈ సినిమాకి పెద్ద ప్లస్.

ఇక లావణ్య చిన్నిపాటి మైనస్

టెక్నికల్ టీం :

దేవిశ్రీప్రసాద్ పాటలు ఇప్పటికే ఓ ఊపు ఊపుతున్నాయి.లైఫ్ ఇజ్ ఏ రెయిన్ బో పాట తెర మీద చాలా బాగుంది.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథ యొక్క మూడ్ కి తగ్గట్టుగా సమకూరింది.సినిమాటోగ్రాఫి పరంగా ఎలాంటి కంప్లయింట్స్ లేవు.రామ్ సొంత సంస్థ కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుపెట్టారు.ఆ ఖర్చు ఫ్రేమ్స్ లో కనిపిస్తుంది.

ఎడిటింగ్ మీద చిన్న కంప్లయింట్స్ ఉండొచ్చు.ఎందుకంటే సినిమా కొంచెం స్లో గా ఉంటుంది.

కాని కథాబలం ఉన్న సినిమాలతో అలాంటి ఇబ్బంది ఉండదు.అందుకు అర్జున్ రెడ్డి ఓ ఉదాహరణ.

ఇప్పుడు ఉన్నది ఒక్కటే జిందగీ మరో ఉదాహరణ (మరో అర్జున్ రెడ్డి అని అనడం లేదు)

విశ్లేషణ :

సరికొత్త పాయింట్ ఏమి తీసుకోలేదు నేను శైలజాలో దర్శకుడు కిషోర్ తిరుమల.కేవలం టేకింగ్, సరిపడా వినోదంతో లాకోచ్చాడు.

కాని అలా ప్రతిసారి నడవదు అని అర్థం చేసుకున్న కిషోర్, ఈసారి మంచి కథావస్తువు ఎంచుకున్నాడు.కమర్శియాలిటి కోసం లేనిపోనీ పోకడలకు పోలేదు.

అలాగని కేవలం ఏ సెంటర్ ఆడియెన్స్ పొంగిపోయే కళాఖండం తీయాలని ప్రయతించలేదు.సింపుల్ గా, అతి చేయకుండా మంచి సినిమా అందించాడు.

సెకండాఫ్ లో లావణ్య త్రిపాఠిని ఈ కథలో భాగం చేసే విధానం బాగున్నా, లావణ్య ఎందుకో ఆ పాత్రలో ఆకట్టుకోలేకపోయింది

అది పక్కనపెడితే, అందమైన ఎమోషన్స్, కంటిని తడిగా మార్చే మూమెంట్స్, కొన్ని నవ్వులు, కొన్ని ఇబ్బందులు.స్నేహితులతో పాటు కుంటుంబం మొత్తం ఇష్టపడే సినిమా ఇది

ప్లస్ పాయింట్స్ :

* ఎమోషన్స్
* డైలాగ్స్
* పాత్రలు
* టెక్నికల్ టీం

మైనస్ పాయింట్స్ :

* స్లో నరేషన్
* లావణ్య

రేటింగ్ : 3.25/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube