తెలంగాణలో కాంగ్రెస్ జోరు ఒక పక్క పెరుగుతుంటే కేసీఆర్ తనదైన ఆలోచనలకి పదునుపెట్టారు.మైండ్ గేమ్ ఆడటంలో కేసీఆర్ చాలా సిద్దహస్తుడు.
రేవంత్ టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్ళిన తరువాత కాంగ్రెస్ ఫుల్ ఎనర్జీ తో ఉంది అంటూ వస్తున్నా వార్తలకి సరైన సమాధానం ఇచ్చారు కేసీఆర్.మేకు ఎక్కడున్నా మేకే పెద్దగా ఏమి లేదు అన్నట్టుగా కేసీఆర్ అది చాలా చిన్న విషయం ఎవరు పట్టించుకోవద్దు అని నేతలకి చెప్పారట
గురువారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది.
దానికి ముందు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నూతన కార్యవర్గంతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.వారికి కేటాయించిన నియోజకవర్గ బాధ్యతలను వివరించారు.
అనంతరం వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.
మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది.అంతకంటే మూడు నెలల ముందే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తాం.
సిటింగ్‌లందరికీ టికెట్లు గ్యారంటీ’’ అని చెప్పారు.ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేలు 90 మంది ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మనం 96 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తామని, 106 స్థానాల వరకూ గెలిచే చాన్స్ ఉందని, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ అని ఎట్లా మనం గెలుపొందాలో నాకు తెలుసు అంటూ కేసీఆర్ మాట్లాడటం పార్టీ నేతల్లో జోష్ ని పెంచింది
తాను సిద్దిపేటలో గట్టిగా పని చేసినా 1989లో ఓడిపోయానని, దీనిని పరిగణనలోకి తీసుకొని 1992లో అక్కడే పార్టీ నాయకులతో పక్కా ప్రణాళిక ప్రకారం పని చేసి, గెలుపొందానని గుర్తు చేశారు.పార్టీ నిర్మాణం, పటిష్ఠం లక్ష్యంగా అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.పార్టీ నిబంధనల ప్రకారం జిల్లా అధ్యక్షులు ఉండరని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ, జిల్లాకు కో-ఆర్డినేటర్లు మాత్రమే ఉంటారని వివరించారు.
తండాలన్నింటికీ పంచాయతీ హోదా ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 4 వేల వరకు చేరవచ్చన్నారు.ఈ మొత్తాన్ని సంవత్సరం.పెంచుతూ చివరికి రూ.25 లక్షలు ఇస్తామన్నారు.దీంతో పల్లెల్లో అభివృద్ధిని చాల క్లోజ్ గా చూసుకోవాలని చెప్పారు
అంతేకాదు .పునర్వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ నియోజక వర్గాలు పెరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.ఈ విషయం మరో 15-20 రోజుల్లో తెలుస్తుందన్నారు.ఈ మేరకు కేంద్రం నుంచి తమకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు.పునర్వ్యవస్థీకరణ జరిగితే రాష్ట్రంలో ఇప్పుడున్న 119 అసెంబ్లీ స్థానాలు పోను అదనంగా 34 స్థానాలు వస్తాయన్నారు.అప్పుడు కొత్తవాళ్లు, చాలా మంది ఎమ్మెల్యేలుగానే కాకుండా ఎమ్మెల్సీలుగా ఎన్నికవుతారని చెప్పారు.
అందరికి అవకాశాలు అందుతాయని.అయితే పార్టీ గెలుపు కోసం అందరు కష్టపడాలని…కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళకి పార్టీలో తప్పక ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు.