జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి దేశీయంగా వున్న చాలా కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయడం ఆరంభించాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా విఆర్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ లిమిటెడ్( VR Films and Studios Limited ) తన వాటాదారులకు ఓ శుభవార్తను ప్రకటించింది.
దీంతో సదరు వాటాదారులు పెద్దమొత్తంలో రాబడిని ఆర్జించబోతున్నారు.అవును, కంపెనీ త్వరలో ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను( Bonus Shares ) అందించనుండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇటీవల మీడియా సంస్థ 7:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది.అంటే ఇక్కడ ఒక్కో షేరుకు కంపెనీకి చెందిన 7 షేర్లు బోనస్ రూపంలో అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఉచితంగా అందిచబడతాయన్నమాట.
ఈ కంపెనీ నుంచి ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుంచి షేర్లు మార్కెట్లో నిరంతరం అప్పర్ సర్క్యూట్‌ను తాకుతూ ఉండడం విశేషం.కాగా జూలై 21 శుక్రవారం స్టాక్ 5 శాతం పెరిగి రూ.371.75 వద్ద ముగిసింది.గత 5 రోజుల్లో స్టాక్ 21 శాతం కంటే ఎక్కువ లాభపడి ఇన్వెస్టర్లకు డబుల్ ధమాకా రాబడులను అందించినట్టుగా సమాచారం.దీనికి తోడు త్వరలో ఉచిత షేర్లు రావటం ఇన్వెస్టర్లను ( Investors ) ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.7:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించేందుకు బోర్డు ఆమోదించిందని జూలై 15, 2023న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ కి( BSE ) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది.
ఇక దీనికోసం జూలై 26ని రికార్డు తేదీగా ప్రకటించింది సదరు కంపెనీ.అంటే ఈ సమయానికి కంపెనీ రికార్డుల్లో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ఉచిత షేర్లు పొందేందుకు అర్హులు అని గుర్తు పెట్టుకోవాలి.అలాగే గడచిన రెండు సంవత్సరాల కాలంలో 250 శాతానికి పైగా మల్టీబ్యాగర్ రాబడులను స్టాక్ అందించింది.ఫలితంగా 5 సంవత్సరాలలో 519.58% బలమైన రాబడిని ఇచ్చింది.ఈ సమయంలో దీని ధర రూ.60 నుంచి ప్రస్తుత స్థాయికి పెరగడం కొసమెరుపు.ఫలితంగా విఆర్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ లిమిటెడ్ వాటాదారులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికలుగా తెలియజేస్తున్నారు.విఆర్ ఫిల్మ్స్ అండ్ స్టూడియోస్ లిమిటెడ్ తో తమకున్న అనుబంధం విడదీయలేనిదని రాసుకొస్తున్నారు.