బిగ్ బాస్ షో మొత్తం స్క్రిప్టేనా.. అసలు విషయం బయటపెట్టిన మాజీ బిగ్ బాస్ విన్నర్?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే .ఇక మనం బిగ్ బాస్ కార్యక్రమం కనుక చూస్తే కొన్నిసార్లు మనకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి.

అసలు బిగ్ బాస్ కార్యక్రమం నిజంగానే కంటెస్టెంట్లు అక్కడ ఆడుతూ ఉంటారా లేకపోతే బిగ్ బాస్ నిర్వహకులు ఇచ్చే స్క్రిప్ట్( Script ) ప్రకారమే హౌస్ లో నడుచుకుంటూ ఉంటారా అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం గురించి తాజాగా మాజీ బిగ్ బాస్ విన్నర్ సన్నీ ( VJ Sunny )ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముఖ్యంగా బిగ్ బాస్ కార్యక్రమం స్క్రిప్ట్ నా లేదా అనే విషయం గురించి కూడా ఈయన వెల్లడించారు.

ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లే కంటెస్టెంట్లు అందరూ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారే అక్కడికి వెళ్తారు.

ఇక అక్కడికి వెళ్లినటువంటి వారు డబ్బు కోసం వారి క్యారెక్టర్ ను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు.బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లు( Bigg Boss Contestants ) ఏమైతే పర్ఫామెన్స్ ఇస్తున్నారో అదంతా కూడా నిజమేనని ఎవరు కూడా వారికి ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరని ఈయన తెలిపారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన వారందరూ కూడా బయట ఎంత మంది పిఆర్ టీంను పెట్టిన కూడా హౌస్ లో వాళ్ళు ఇచ్చే పర్ఫామెన్స్( Performance పైనే ఆధారపడి ఉంటుందని ఈయన తెలియజేశారు.

బిగ్ బాస్ కార్యక్రమం స్క్రిప్ట్ ప్రకారమే ప్రసారమవుతుందని అందరూ అనుకుంటున్నారు.బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదని ఈ సందర్భంగా సన్నీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు