ఎగిరే డ్రోన్ గురించి తెలుసు.. మరి ఈత కొట్టే వాటర్‌ డ్రోన్ గురించి విన్నారా?

ఆకాశంలో ఎగిరే డ్రోన్‌లు గురించి అందరు విన్నారు, చదివారు.అయితే నీటిలో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయేవారి ప్రాణాలు కాపాడే వాటర్ డ్రోన్ గురించి ఇంతవరకు ఎవరు విని వుండరు.అలాంటి డ్రోన్ చూడాల్సిందే మీరు వైజాగ్ వెళ్లాల్సిందే.అవును… విశాఖ తీరంలో కొందరు యువకులు కలిసి తయారు చేసిన ఈ వాటర్ డ్రోన్ ఇప్పుడు వైజాగ్ లో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.సముద్రంలో ఈతకు వెళ్లి పొరపాటున మునిగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు.అలాంటి వారిని కాపాడటానికి లైఫ్ గార్డ్స్, ఇతర సిబ్బంది ఉన్నప్పటికీ కొన్నిసార్లు అనేక పొరపాట్లు జరిగే అవకాశం లేకపోలేదు.

 Vizag Based Techie Made Water Drone To Save People From Drowning Details,  Water-TeluguStop.com

ఇకపోతే అలాంటి సందర్భాలలో నీటిలో ఉండగా కనీసం ఇద్దరు లేదా ముగ్గురుని ఈ డ్రోన్ కాపాడగలదని దీని క్రియేటర్స్‌లో అలీ అస్గర్ అంటున్నారు.ఇప్పటికే పలు ప్రదర్శనల్లో, ఎక్స్పోల్లో ఈ వాటర్ డ్రోన్ ఎంతో మంది మన్ననలను అందుకుంది.

ఇక దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసే ఆలోచనలో ఉందని అంటున్నారు.ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో విశాఖలో తయారైన పరికరం కావడం విశేషం.ఇలాంటి వాటర్ డ్రోన్ తయారు చెయ్యడం కూడా దేశంలో ఇదే మొదటిసారి అని అలీ అస్గర్ చెప్పడం ఇక్కడ విశేషం.

వాటర్ డ్రోన్ విశేషాలు:

Telugu Ali Asgar, Save, Ups, Latest, Vizag, Vizag Techie, Drone-Latest News - Te

1) ఈ వాటర్ డ్రోన్ పూర్తిగా రిమోట్ ఆధారితంగా వర్క్ చేస్తుంది.

2) ఇది నీటిలో 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకనుల్లో చేరుకుంటుంది.

3) ఈ వాటర్ డ్రోన్ కనీసం ముగ్గురిని ఒకేసారి కాపాడగలదు.

4) గంటకు 15 km వేగంతో అలల ఉద్ధృతిని దాటుకుని మరీ ఇది ముందుకు దూసుకెళ్లగలదు.

5) బ్యాటరీ ఒకసారి రీఛార్జ్ చేస్తే గంట పాటు ఏకధాటిగా పనిచేస్తుంది.దానితోపాటే 5నుంచి 6 గంటల వరకూ స్టాండ్ బై మోడ్‌లో ఉంచొచ్చు.బ్యాటరీని కూడా అరగంటలోనే 80 శాతం రీచార్జ్ చేసేయ్యొచ్చు.

6) సముద్రంలోనే కాకుండా నదుల్లో వచ్చే వరద సమయాల్లో కూడా మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఈ డ్రోన్ ఉపయోగపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube