చాలామంది ఒంటిపై టాటూలు( Tattoos ) వేయించుకుంటూ ఉంటారు.ఒకప్పుడు సెలబ్రెటీలు మాత్రమే ఎక్కువగా టాటూలు వేయించుకునేవారు.
కానీ ఇప్పుడు ఈ క్రేజ్ మరింత పెరిగింది.సెలబ్రెటీలను చూసి యువత కూడా టాటూలను వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది.
దీనిని ఒక క్రేజ్‌గా అందరూ భావిస్తున్నారు.స్ట్రైల్గా కనిపించేందుకు యువతీ, యువకులు ఎక్కువగా టూటాలు వేయించుకుంటున్నారు.
కొంతమంది అయితే బాడీ మొత్తం టాటూలు వేయించుకుని రికార్డు సృష్టిస్తున్నారు.
అయితే చాలామంది తమకు ఇష్టమైన ఫొటో లేదా పేరును టాటూ వేయించుకుంటారు.
విభిన్న రకాల డిజైన్లలో టాటూలు ఉంటాయి.తాజాగా ఒక వ్యక్తి కళ్లజోడు రూపంలో టాటూ ( Spects Tattoo ) వేయించుకున్నాడు.
అదీ కూడా కళ్లపై కళ్లజోడు టాటూను వేయించుకున్నాడు.దీంతో అది అచ్చం చూడానికి కళ్లజోడులా ఉంది.
నిజంగానే కళ్లజోడు పెట్టుకున్నాడని అనుకునేలా ఈ విభిన్నమైన టాటూ కనిపిస్తోంది.ఈ టాటూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social Media ) తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి ఇప్పటికే కళ్లజోడు ఉంది.టాటూ బాడీపై చెక్కించుకున్న తర్వాత కళ్లజోడు పెట్టుకుని వీడియోలో కనిపించాడు.అయితే కళ్లజోడు ఇప్పటికే కలిగి ఉన్న వ్యక్తి మళ్లీ అదే టాటూను ఎందుకు వేయించుకున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
బోర్నాకాంగ్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేశారు.కళ్లజోడు ఫ్రేమ్ ఎలా ఉంటుందో అలా కళ్లపై డిజైన్ చేయించుకున్నాడు.నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియోకు ఇప్పటివరకు 13 మిలియన్ల వ్యూస్, 48 వేలకుపైగా లైక్స్ వచ్చాయి.ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.వీరంతా మనల్ని నవ్వించడానికి పుట్టిన కారణజన్ములని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇక మరికొంతమంది ఇలాంటి టాటూ వేయించుకున్న మొదటి వ్యక్తిని చూస్తున్నానని వ్యాఖ్యానించగా.గంటిపై టాటూ వేయించుకున్నాడంటే అతనిది గట్టి గుండె అని అంటున్నారు.