సాధారణంగా పాములను చూస్తూనే ఒకరకమైన భయం పుట్టుకొస్తుంది.అలాంటి నాగుపామును చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
మనకి దూరంగా నాగుపాము కనిపిస్తేనే అక్కడి నుంచి దూరంగా పారిపోతుంటాము.అయితే ఇటీవల కాలంలో నాగుపాములు జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలను తరచుగా చూస్తూనే ఉన్నాము.
అంతేకాక.నాగుపాములు ఎంతోమందిపై దాడి చేసి కాటు వేసిన ఘటనలను తరచూ వింటూనే ఉన్నాం.
పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు.ఆస్పత్రి పాలైన వారి సంఖ్య అధికంగానే ఉంది.
మనుషుల కంటికి కనిపించకుండా పాములు ఎక్కడో చిన్న ప్రదేశాలలో నక్కి ఉంటాయి.ఇక మనుషులు దగ్గరికి వచ్చిన వెంటనే పాము పడగ విప్పి దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.
ఇదే తరహాలో ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇక కేవలం క్షణకాల వ్యవధిలో ఒక వ్యక్తి ఏకంగా మృత్యువు నుండి తప్పించుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
గోడ పక్కనే నక్కి ఉన్న పాము ఏకంగా ఒక యువకుడిని కాటు వేసేందుకు ముందుకు వచ్చింది.అదృష్టవశాత్తు అప్పటికే అతడు కాస్త దూరంలో ఉన్నాడు.
దాంతో అతడు పాము కాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు.ఆ యువకుడు ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
ఈ సంఘటన కేరళలోని కొల్లా జిల్లాలోని కోనతూరులో చోటు చేసుకుంది.ఓ విద్యార్థి స్కూల్ యూనిఫామ్ ధరించుకుని ఇంటి నుంచి స్టార్ అయ్యాడు.అతడు ఇంటి ముందు ఉన్న గేట్ దగ్గర నిల్చొన్నాడు.కొంత సమయం గడిచాక ఆ విద్యార్థి లోపలికి వచ్చి గేటు మూసేస్తూ ఉన్న సమయంలో గోడ పక్కనే పాము ఉండటం గమనించి వెంటనే అతడు ఓ కొంచెం దూరం వెనక్కి జరిగాడు.
పాము కూడా పడగవిప్పి విద్యార్థిని కాటు వేయడానికి ప్రయత్నించింది.అప్రమత్తమైన విద్యార్థి క్షణకాల వ్యవధిలో ఆ పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియో చూసిన టిజన్లు సైతం క్షణకాలంలో ఎంత ప్రమాదం తప్పిందని కామెంట్స్ చేస్తున్నారు.