వైరల్: 150 రుచులతో కోడలికి అత్త విందు..!

మన పెద్దలు ఓ సామెత చెబుతారు.గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని చెబుతుంటారు.

 Viral Mother In Law With 150 Different Dishes To Daughter In Law , Viral News, V-TeluguStop.com

అది అక్షరాల సత్యం.గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ.

కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.రకరకాల వంటకాలతో వారిని సంతోషపెడుతారు.

ఎప్పటి నుంచి ఈ మర్యాద కొనసాగుతూ వస్తోంది.ఒక వేళ ఏదైనా పెద్ద పండగ వచ్చిందే అనుకోండి ఇక అంతే సంగతులు.

ప్రతి ఇంటిలో రకరకాలుగా పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు ఇలా రకరకాలుగా ప్రత్యక్షమవుతాయి.వారు చేసే మర్యాదలకు ఆ ప్రత్యేకతే వేరు.

బంధువులకే ఇలా చేస్తే ఇక ఆ ఇంటికి వెళ్లి అల్లుడికి చేసే మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు.కొత్తగా ఆ ఇంటికి వెళ్లిన అల్లుడికి వారు చేసే పద్దతులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

అల్లుడికే కాదు అత్తారింటికి వచ్చి కొత్త కోడలికి కూడా ఓ ప్రత్యేక సంప్రదాయన్ని పాటిస్తారు.

వీరు మాత్రమే అనుకుంటే పొరపాటే.

అత్త, మామలకు పుట్టినరోజు వస్తే చాలు కోడలు, కొడుకులు చేసే ఆర్బాటం అంతా ఇంత కాదు.తాజాగా కొన్ని రోజులకు ముందు ఓ అత్తకు పుట్టినరోజు కావడం వల్ల ఓ కోడలు 60 రకాలైన వంటలు చేసి పెట్టి విందు భోజనం ఏర్పాటు చేసింది.

Telugu Dishes, Andhra Pradesh, Godavari, Mother Law, Mother Inlaw, Meida, Latest

అదే విధంగా తాజాగా అత్త, మామలు ఇద్దరూ కలిసి ఓ కోడలికి 150 రకాలైన వంటలతో వింధును ఏర్పాటు చేయడం విశేషం.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తుంపూడి వెంకటకృష్ణ దంపతులు తమ కోడలికి అపురూప కానుకను ఇచ్చారు.కోడలు తేజస్విని జన్మదినం కావడం వల్ల అద్బుతమైన విందును ఏర్పాటు చేశారు.150 రకాలైన విందులో 14 రకాల రైస్ ఐటమ్స్ ఉన్నాయి.ఆ తర్వాత 35 రకాలైన స్వీట్లు ఉన్నాయి.ఇంకో 35 రకాలైన హాట్ ఐటెమ్స్ ఉండటం విశేషం.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube