వైరల్: భర్తకు షాపింగ్ చేయడానికి ఏ బార్య ఇంత క్లారిటీ ఇవ్వలేదేమో కాబోలు..!

సాధారణంగా ఇంట్లో ఎమన్నా వంట సరుకులు అయిపోయినాగాని, కూరగాయలు కావాలన్నా గాని అన్ని ఆడవాళ్లే చూసుకుంటారు.కొంతమంది మగవాళ్ళు మాత్రమే ఇంట్లోకి కావలిసన సరుకులు, కూరగాయలు తెస్తూ ఉంటారు.

 Viral Latest, Viral News, Social Media, Wife And Husband, Shopping List, Viral P-TeluguStop.com

అయితే ఇక్కడొక భార్య తన భర్తకి ఇంట్లోని సరుకులు అయిపోయాయి సూపర్ మార్కెట్లోకి వెళ్లి తీసుకుని రండి అని రాసిన ఒక లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అసలు ఇంతకీ ఆ మహాతల్లీ ఆ లెటర్ లో ఏమి రాసిందో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.

భర్తలకు సరుకులు తేవాలంటే ఏ సరుకులు తేవాలి, ఎంత క్వాంటిటీలో తేవాలో అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఇస్తాము.ఇది అందరు భార్యలు చేసే పనే కదా.

ఇందులో విచిత్రం ఏముంది అని అనుకోకండి.తన భర్త ఎక్కడ కష్టపడతాడో అని ఒక భార్యమణి డీటెయిల్ గా ఉత్తరం రాసినట్టు మరి సరుకుల లిస్ట్ రాసి ఇచ్చింది.

అక్కడ వరకు పర్వాలేదండోయ్.తన భర్త ఎక్కడ సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి, అసలు దాని అడ్రెస్ ఏంటి అనేది రూట్ మ్యాప్ తో సహా గీసింది.

అలాగే ఇంట్లోకి కావలిసిన వస్తువు పేరు, సూపర్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది, ఆ వస్తువు ధర, ఫొటోతో పాటు ఇంకొన్ని వస్తువుల జాబితా రాసి తన భర్తకు ఇచ్చి ఆశ్చర్యంలో పడేసింది.

Telugu List, Latest-Latest News - Telugu

ఇప్పుడు ఈ భార్య భర్తల సరుకుల లిస్ట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ వీడియోను మెలిండా అనే ఆవిడ తన టిక్‌టాక్ అకౌంట్‌ లో షేర్ చేసింది.అయితే ఈ లిస్ట్ నిజంగా రాసింది కాదని ఏదో సరదాగా రాసిన లిస్ట్ అని వీడియో చివర్లో చెప్తారు.

అది విని వీడియో చూసిన ప్రతి ఒక్కరకి షాక్ కు గురిచేసింది.అయినాగానీ నెటిజన్లు ఈ వీడియోను బాగా పాపులర్ చేసారు.ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.ఇంత డీటెయిల్ గా లిస్ట్ రాసి ఇచ్చింది కదా అందులో ఏదన్నా వస్తువు మిస్ అయిందో అనుకో.

నీ పని అవుట్ అంటూ భర్తను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube