చెడ్డీ గ్యాంగ్ కు చెక్ పెట్టిన బెజవాడ పోలిసులు...

విజయవాడ: చెడ్డీ గ్యాంగ్ కు చెక్ పెట్టిన బెజవాడ పోలీసులు.విజయవాడ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వివిధ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు అరెస్ట్.

 Vijayawada Police Caught Group Members Of Cheddi Gang Details, Vijayawada Police-TeluguStop.com

పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటా కామెంట్స్… ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించాం.దొంగతనాల నియంత్రణకై పోలీసు గస్తీని ముమ్మరం చేయడంతో పాటు పాత నేరస్థులు, జైలు నుండి విడుదలైన నేరస్థులు మరియు అనుమానాస్పద వ్యక్తులు మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరస్తుల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశాం.

విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం మరియు పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం.

టూటౌన్ ఇన్ స్పెక్టర్ మోహన్ రెడ్డి పెనమలూరు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ మరియు సి.సి.ఎస్.సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నాం.గుజరాత్ కు చెందిన మడియా కాంజీ, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియా ను అరెస్ట్ చేశాం.

Telugu Cheddi Gang, Gujarat, Commissiioer, Vijayawada-Press Releases

నేరం జరిగిన విధానం:

నేరానికి వచ్చేటప్పుడు నిక్కరు ధరిస్తారు కాబట్టి వీరిని చెడ్డీ గ్యాంగ్ అని పిలవబడుతున్నారు.వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు.కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్ళలో ప్రయాణం చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నగర శివారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్ మెంట్ లను పగలు సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళుతూ ఉంటారు.

Telugu Cheddi Gang, Gujarat, Commissiioer, Vijayawada-Press Releases

పై నేరాలను వీరు రెండు గ్యాంగ్ లుగా విడిపోయి నేరాలకు పాల్పడినారు.వారిలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది.మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది.20,000/-లు నగదు 32 గ్రాముల బంగారం 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నాం.పై కేసులలో దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందిస్తున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube