పోలీసులకు చంద్రబాబు ఇచ్చిన హామీపై విజయసాయి రెడ్డి సెటైర్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి అంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పుంగనూరులో( Punganuru ) పర్యటన చేపడుతూ ఉండగా టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

 Vijayasai Reddy Satire On Chandrababu Promise To The Police Details, Vijayasai-TeluguStop.com

ఈ ఘర్షణలో దాదాపు 40 మందికి పైగా పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.దీంతో 62 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసు కూడా పెట్టడం జరిగింది.

ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.కాగా ఇటీవల.

వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే పోలీసులకు “వర్క్ ఫ్రం హోం”( Work From Home ) అనే పని విధానం తీసుకురాబోతున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఈ హామీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.“ఏది ట్రెండింగులో ఉంటే దాన్ని ఫాలో కావడం చంద్రబాబు గారి బలహీనత.కోవిడ్ తర్వాత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అమలులోకి వచ్చింది.

పోలీసులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఎలా సాధ్యం? మొన్న 50 మంది పోలీసులను రక్తాలు కారేలా కొట్టించాడు.అసాధ్యమని తెలిసి కూడా వారిని బుజ్జగించేందుకు ఇప్పుడీ అనాలోచిత హామీ గుప్పించాడు” అని పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube