మన భారతదేశంలో రోడ్లపై యాక్సిడెంట్లు జరగడానికి ప్రధాన కారణాలు ఏవంటే.చాలా రోడ్లు నాణ్యత లేకుండా ఉండడం, ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళు అధికంగా ఉండడం లాంటి వాటితో పాటు చాలాచోట్ల వీధిలైట్లు వెలుగుక పోవడం లాంటి కారణాల వల్ల కార్లు ప్రమాదాలకు( Car Accidents ) గురవుతున్నాయి.
అన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా రోడ్లపై ఆక్సిడెంట్లు జరుగుతూ ఉండడంతో కారులో ప్రయాణించే వారికి భద్రత ఉండాలి.కాబట్టి కార్లు కొనే ముందు కచ్చితంగా సేఫ్టీ ఫీచర్లను( Safety Features ) పరిశీలించాలి.
సేఫ్టీ ఫీచర్ల విషయంలో అస్సలు రాజీ పడకూడదు.దేశంలో జోరుగా అమ్ముడవుతున్న అనేక టాప్ సెల్లింగ్ కార్ల పనితీరు క్రాష్ టెస్ట్ లలో చాలా పేలవంగా ఉంది.
కాబట్టి కారు కొనేముందు అధిక ప్రాధాన్యత భద్రతకు ఇవ్వాలి.అలాంటి కార్లు ఏవో చూద్దాం.
Tata Altroz:
ఈ కారు భద్రతాపరంగా, టాటా మోటార్స్ ప్రతి సెగ్మెంట్ కార్లలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది.భారతదేశంలో అత్యంత సురక్షితమైన 5-స్టార్ రేటింగ్ కలిగిన కార్లలో ఈ టాటా అల్ట్రోజ్ కారు( Tata Altroz ) కూడా ఉంది.ఈ కారు ధర రూ.6.60 లక్షల నుంచి రూ.10.74 లక్షల మధ్య ఉంటుంది.

Nissan Magnetic:
ఈ కారు క్రాష్ టెస్ట్ లో 4- స్టార్ రేటింగ్ పొందింది.తక్కువ బడ్జెట్లో లభించే సేఫ్టీ కార్లలో ఈ కారు ఉంది.ఈ కారు టర్బో పెట్రోల్ ఇంజన్ తో ఉంటుంది.ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.6 లక్షల నుండి మొదలై రూ.11 లక్షల మధ్య ఉంటుంది.

Tata Punch:
ఈ కారు క్రాష్ టెస్టులో 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ తో వచ్చిన ఏకైక కారు.ఈ 5- సీటర్ మైక్రో SUV మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ విభాగంలో ఉత్తమమైనది.ఈ కారు ధర రూ.6 లక్షల నుండి మొదలై రూ.10.10 లక్షల మధ్య ఉంటుంది.

Renault Kiger:
ఈ SUV గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ 4-స్టార్ తో ఆమార్చబడిన, తక్కువ బడ్జెట్ లో వస్తున్న సురక్షితమైన సబ్- కాంపాక్ట్ SUV.కారు ధర రూ.6.5 లక్షల నుండి మొదలై రూ.11.23 లక్షల వరకు ఉంటుంది.







