టాలీవుడ్ చూపు మొత్తం ఇప్పుడు విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం ( Kushi Movie ) మీదనే ఉంది.ఎందుకంటే ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాయి.
పవన్ కళ్యాణ్ ‘బ్రో’,( Bro Movie ) ప్రభాస్ ‘ఆదిపురుష్’( Adipurush ) చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.చిన్న సినిమాలు మాత్రమే తమ ఉనికిని చాటి, బంపర్ హిట్స్ గా నిలిచి టాలీవుడ్ కి ఊపిరి పోసింది.
డబ్బింగ్ సినిమాల హవా కూడా గట్టిగానే నటించింది.రీసెంట్ గా విడుదలైన రజినీకాంత్ జైలర్ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా బోల్తా కొట్టి బయ్యర్స్ కి భారీ లాస్ ఇచ్చిన ఈ నేపథ్యం లో ‘జైలర్’ చిత్రం సూపర్ హిట్టై లాభాల వర్షం కురిపించింది.
ఇప్పుడు అందరూ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ కోసమే ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా చిత్రం పై అంచనాలను పెంచేలా చేసింది.ముఖ్యంగా ఈ చిత్రం లోని ప్రతీ పాట సూపర్ హిట్ అయ్యింది.
సోషల్ మీడియా లో మరియు బయట ఎక్కడ చూసిన ఈ పాటలే కనిపిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రసాద్ ల్యాబ్స్ లో( Prasad Labs ) కొంత మంది మీడియా మిత్రులు మరియు సినీ ప్రముఖులకు వేసి చూపించారు.
దీనికి వారి నుండి అద్భుతమైన స్పందన లభించింది.
ఈమధ్య కాలం లో వచ్చిన ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ఇదేనని, రొటీన్ కి బిన్నంగా ఈ చిత్రం ఉందని, ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కచ్చితంగా వేరే లెవెల్ కి వెళ్తుందని, కలెక్షన్స్ పరంగా స్టార్ హీరో రేంజ్ ఉంటాయని ఆశిస్తున్నారు.ఇక విజయ్ దేవరకొండ మరియు సమంత( Samantha ) జంటని కొన్నేళ్ల వరకు గుర్తు పెట్టుకుంటామని, ఇద్దరు పోటీపడి మరి నటించారు అంటూ టాక్ వినిపిస్తుంది.వచ్చిన టాక్ పబ్లిక్ నుండి కూడా వస్తే కచ్చితంగా ఊహించినట్టుగానే ఈ సినిమా వండర్స్ ని క్రియేట్ చేస్తుందనే చెప్పాలి.
చాలా కాలం నుండి సరైన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సినిమా ఆకలి తీర్చినట్టే.చూడాలి మరి విజయ్ దేవరకొండ ని ఈ చిత్రం లైగర్( Liger ) ఫ్లాప్ ఇమేజి నుండి బయట పడేస్తుందా లేదా అనేది.