విజయ్ దేవరకొండ 'లైగర్' థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న హైదరాబాద్, ముంబైలో గ్రాండ్ లాంచ్

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) థియేట్రికల్ ట్రైలర్ జూలై 21న విడుదల కానుంది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని సౌత్ తో పాటు నార్త్ లో కూడా నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు.

 Vijay Devarakonda Ananya Panday Liger Movie Theatrical Trailer Release Date Anno-TeluguStop.com

విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మి కౌర్, ఇతర టీమ్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు.ఛార్మి రెండు ఈవెంట్‌లను నిర్వహించాలనే ప్రతిపాదనను ఉంచగా, కరణ్ దానిని ఆమోదించగా, ట్రైలర్ తుఫాను సృష్టించబోతోందని విజయ్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది.ముంబై ఈవెంట్ అంధేరిలోని సినీపోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.

లైగర్ టీమ్ ఇప్పటికే టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్‌తో భారీ బజ్ ని క్రియేటర్ చేయగా, ట్రైలర్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ తుఫాన్ ని సృష్టించడానికి రెడీ అవుతుంది.విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయిక గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్‌పై అరంగేట్రం చేస్తున్నారు.

పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం:

విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: పూరీ జగన్నాథ్, నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్, డీవోపీ: విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, స్టంట్ డైరెక్టర్: కేచ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube