రీల్స్ కోసం సైకోగా మారిన యువకుడు.. వాడు కనిపిస్తే చెప్పమని వేడుకుంటున్న పోలీసులు!

సోషల్ మీడియా( Social Media ) బాగా ప్రబలడంతో అనేకమంది వాటికి అడిక్షన్ అయిపోయిన పరిస్థితి.కొంతమంది రీల్స్‌ చేసే క్రమంలో ఏకంగా సైకోలుగా( Psycho ) మారిపోతున్న ఘటనలు వెలువడుతున్నాయి.

 Video Of Madhya Pradesh Man Harassing Peacock Viral Cops Hunt For Accused Detail-TeluguStop.com

వ్యూస్ కోసం వారు దేనికైనా దిగజారుతున్నారు.కొంతమంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటే, మరికొందరు ఎదుటివారి ప్రాణాలను రిస్కుతో పెట్టేసిన పరిస్థితి.

ఇంకొందరు అయితే రీల్స్‌ వ్యూస్‌ కోసం మానవత్వం మర్చిపోయి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నారు.ఇక్కడ కూడా అలాంటి ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది.

ఓ యువకుడు, యువతి రీల్స్‌ చేస్తూ నోరులేని అందమైన మన జాతీయ పక్షి నెమలిని( Peacock ) చిత్ర హింసలకు గురిచేశారు.కాగా దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ మధ్యప్రదేశ్‌లోని కట్నీలో జరిగినట్టు తెలుస్తోంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు క్రూరమైన రీతిలో నెమలి ఈకలను పీకేయటం మనం స్పష్టంగా చూడవచ్చు.ఈ యువకుడు చేస్తున్న పనిని పక్కనే యువతి చోద్యం చూస్తూ కూర్చుంది.కాగా జనాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ ఘటనకు సంబంధించి అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.అయితే నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.కాబట్టి వాడు బయట ఎక్కడ కనబడ్డా సమాచారం ఇవ్వమని చెబుతున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కిరాతక చర్యకు పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అతని పేరు అతుల్ కొహనేగా గుర్తించారు.ఈ వీడియోను అతుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్‌గా అప్‌లోడ్ చేశాడు.వ్యూస్‌ కోసమే ఇలా చేశాడని తెలుస్తోంది.అంతేకాకుండా ఆ నెమలిని చంపేసి వండుకు తిన్నాడంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

నిందితుడి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నట్టుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube