ఆ స్టార్ హీరో తనతో ఆ పని చేయాలంటూ టార్చర్ చేశాడు.. హన్సిక షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా హన్సికకు ( hansika )మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే.జూనియర్ ఖుష్బూగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోయినా తమిళంలో అడపాదడపా ఆఫర్లతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Heroine Hansika Shocking Comments About Casting Couch Details Here Goes Viral ,-TeluguStop.com

పెళ్లి తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు అయితే తగ్గాయనే సంగతి తెలిసిందే.చిన్న వయస్సులోనే హన్సిక సినిమాల్లోకి రాగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు.

అయితే తాజాగా హన్సిక టాలీవుడ్( Tollywood ) స్టార్ హీరోపై సంచలన ఆరోపణలు చేయడం సోషల్ మీడియా( Social media )లో హాట్ టాపిక్ అవుతోంది.బాలనటిగా పలు సినిమాలలో నటించిన హన్సిక దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హన్సిక ఇండస్ట్రీలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీలో తనకు కూడా చేదు అనుభవాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.

Telugu Hansika, Tollywood-Movie

కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్ ప్రముఖ హీరో ఒకరు నన్ను ఇబ్బందులకు గురి చేశాడని డేట్ కు రావాలని పదేపదే అడిగి విసిగించాడని హన్సిక పేర్కొన్నారు.నన్ను విసిగించిన ఆ హీరోకు తగిన బుద్ధి చెప్పానని ఆమె చెప్పుకొచ్చారు.అయితే హన్సిక పేరు చెప్పకపోవడంతో అభిమానులలో ఎవరికి నచ్చిన పేరును వాళ్లు అనుకుంటున్నారు.హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లకే ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయంటే సాధారణ హీరోయిన్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Telugu Hansika, Tollywood-Movie

అయితే ఈ తరహా ఘటనల్లో చాలామంది హీరోయిన్లు పేర్లు చెప్పకుండా తప్పు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.హీరోల పేర్లను బహిరంగంగా వెల్లడిస్తే ఆ హీరోలకు సైతం బుద్ధి వచ్చే ఛాన్స్ ఉంది.ఆయా హీరోల చేతిలో ఇతర హీరోయిన్లు సైతం మోసపోకుండా ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube