ఆడవాళ్లు మీకు జోహార్లు రిజల్ట్.. వెంకటేష్ హ్యాపీ..!

శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది.

 Victory Venkatesh Super Happy With Amj Result, Adavallu Mee Joharlu, Amj, Rashmi-TeluguStop.com

ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఇది సినిమా కాదు సీరియల్ అనేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా శర్వానంద్ కన్నా ముందు విక్టరీ వెంకటేష్ దగ్గరకు వెళ్లింది.

కిశోర్ తిరుమల వెంకటేష్ కాంబోలో ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.అయితే ఎందుకో ఏమో కానీ ఎనౌన్స్ మెంట్ తర్వాత వెంకటేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నారు.

వెంకీ కాదన్న ఈ ప్రాజెక్ట్ కి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సినిమా కథ బాగున్నా మరీ సీరియల్ లా ఎమోషల డ్రామా నడిపించాడని డైరక్టర్ మీద ఆడియెన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మిస్ చేసి వెంకటేష్ మంచి పనిచేశాడని విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ కి సంబందించిన అప్డేట్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube