వర్ధమాన నటి టీనా చౌదరికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సత్కారం..

ఇటీవల ప్రముఖ హాస్య నటుడు అలీతో ‘పండుగాడి ఫోటో స్టూడియో’ చిత్రంలో నటించిన వర్ధమాన నటి టీనా చౌదరి కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తుంది.ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఇనుప మేకులపై కూచిపూడి నృత్యం చేసి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు అందుకున్నారు.

 Vice President Venkaiah Naidu Pays Tribute To Actress Tina Chowdhury Details, Vi-TeluguStop.com

ఏంతో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆసాంతం ప్రదర్శనను రక్తి కట్టించారు.

టీనా చౌదరి నృత్యం స్వయంగా చూసిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెను సత్కరించారు.

వెంకయ్య నాయుడుకి ఆమె పాదాభి వందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు.తన జీవితంలో మరువలేని రోజు ఇదని ఆమె చెప్పారు.

విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో టీనా చౌదరి ఇంజనీరింగ్ చదువుతున్నారు.ఆమె తండ్రి మన్నే సత్యనారాయణ, తల్లి శివకుమారి గుంటూరు జిల్లా తెనాలిలో లెక్చరర్లుగా పని చేస్తున్నారు.

తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన, గురువుల వద్ద శిష్యరికం తనకు తోడుగా నిలిచాయి అని టీనా చౌదరి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube