నితిన్-వెంకీ మూవీలో మరో స్టార్ హీరో.. ఆయనను ఒప్పిస్తే భారీ హైప్ ఖాయం!

యూత్ స్టార్ నితిన్( Nitin ) మరోసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో చేయి కలిపాడు.ఛలో, భీష్మ వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని ఫేమస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

 Venky Kudumula Nithiin's Vnrtrio Latest Update , Venky Kudumula, Nithiin, Rashmi-TeluguStop.com

అయితే ఈయన భీష్మ( Bheeshma ) తర్వాత మరో సినిమా చేయలేదు.ఈ సినిమా వచ్చిన మూడేళ్ల తర్వాత మొన్ననే మరో సినిమాను ప్రకటించాడు.

అది కూడా మళ్ళీ భీష్మ కాంబోలో.నితిన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా భీష్మ వంటి సూపర్ హిట్ సినిమా వచ్చింది.డైరెక్టర్ వెంకీ కుడుముల( Venky Kudumula ) దర్శకత్వంలో ఈ కాంబో తెరకెక్కగా మళ్ళీ ఇదే కాంబోలో మరో సినిమా రాబోతుంది అని అనౌన్స్ మెంట్ వచ్చింది.‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

వెంకీ కుడుముల లేటెస్ట్ గా ప్రకటించిన ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.ఇక అనౌన్స్ మెంట్ వీడియో తోనే రచ్చ రచ్చ చేసిన ఈ కాంబో అంచనాలు బాగా క్రియేట్ చేసుకుంది.ఇప్పటికే గ్రాండ్ లాంచ్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక ఈ సినిమా నుండి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉందని ఆ పాత్రలో ఒక స్టార్ హీరోను నటింపజేయాలని వెంకీ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.అందుకోసం వెంకీ ఒక బాలీవుడ్ హీరోను ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట.మరి బాలీవుడ్ స్టార్ కనుక ఇప్పుకుంటే ఈ సినిమాకు హిందీ మార్కెట్ లో కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది.చూడాలి వెంకీ ఏ స్టార్ ను ఒప్పిస్తాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube