సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ( Venkatesh )ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎప్పుడు లేనంత అంచనాలు ఉన్నాయి.
హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమాతెరకెక్కుతుండగా ”సైంధవ్” అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసారు.
వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణ్( Santhosh Narayanan ) మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) నటిస్తుండగా.
ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ( Nawazuddin Siddiqui ) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మెయిన్ హైలెట్ గా నిలుస్తున్నాయి.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షెడ్యూల్ కర్ణాటక లోని బీదర్ లో జరుపు కుంటున్నట్టు టాక్.ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అని చేతబడి అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే టాక్ వచ్చింది.
బీదర్ లో యాక్షన్ థ్రిల్లర్ అంశాలను తెరకెక్కిస్తున్నట్టు టాక్.వెంకటేష్ పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.తండ్రి, కూతురు సెంటిమెంట్ ను ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు కానీ బ్లాక్ మ్యాజిన్ అంశం అనేది రివీల్ చేయలేదు.థియేటర్స్ లో ఈ కాన్సెప్ట్ ను చూసి థ్రిల్ అవ్వాలని మేకర్స్ భావన.
మరి ఈ కథతో శైలేష్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.