సౌత్ బ్యూటీ సమంత( Samantha ) న్యూయార్క్ (Newyork) లోని ఇండియా డే పరేడ్ లో పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ హీరోయిన్ తన తల్లితో కలిసి న్యూయార్క్ కి పయనమైంది.
అక్కడ ఆగస్టు 20వతేదీన జరిగిన ఇండియా డే పరేడ్లో పాల్గొంది.
ఇక ఆ ర్యాలీకి ఇండియా నుండి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండేజ్ (Jaquelin Fernadez) అలాగే ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ కు కూడా ఆహ్వానం అందింది.
వీళ్ళు కూడా అందులో పాల్గొన్నారు.ఇక వీళ్ళు ఇండియా డే పరేడ్లో పాల్గొన్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఇక వీటన్నింటిలో సమంత వేసుకున్న డ్రెస్ అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
దాంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన సమంత (Samantha) ఫోటోలలో అందరి చూపు సమంత ధరించిన డ్రెస్ పై పడింది.
అంతే కాదు ఆ డ్రెస్ చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉండటమే కాదు దాని ఖరీదు తెలిస్తే కూడా వామ్మో అని నోరెళ్ళబెట్టడం ఖాయం .మరి ఇంతకీ సమంత ఇండియా డే పరేడ్ లో వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందామా.
సమంత న్యూయార్క్ లో జరిగే 41 ఇండియా డే పరేడ్ (India day parade) వేడుకల్లో ఆమె వేసుకున్న డ్రెస్( Samantha Dress ) మీద అందరి దృష్టిపడింది.ఈ డ్రెస్ ని డిజైన్ చేసింది రీతు కుమార్.ఇక ఈమె వేసుకున్న డ్రెస్ ఎంబ్రాయిడరీ కార్సెట్ తో పాటు ప్యాంట్ జాకెట్ సెట్ తో ఉండి అందరిని ఆకట్టుకుంది.ఇక ఈ డ్రెస్ సమంతకు చాలా బాగా ఉండడంతో అందరి దృష్టి దానిపైనే పడింది.ఇక డ్రెస్ అందంగా ఉండటమే కాదు ఆ డ్రెస్ ఖరీదు దాదాపు 2.95 లక్షలు అని తెలుస్తోంది.
సమంత (Samantha) ఒక్క డ్రెస్ కే అంతా ఖర్చు చేసి కొనుగోలు చేసిందా అంటూ ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సెలెబ్రెటీల డ్రెస్సులు, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, మెడలో ధరించే నెక్లెస్ లు,చేతికి పెట్టుకునే వాచ్ ల ఖరీదు కోట్లలో ఉంటుంది అనే సంగతి ఇప్పటికే ఎంతమంది హీరో హీరోయిన్ల విషయంలో చూశాం.