15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి మెకానిక్.. ఇప్పుడు ఐఏఎస్.. వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీకి షాకవ్వాల్సిందే!

మనలో కొంతమందికి నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అయితే ఆ కష్టాలను దాటి కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాలి.

 Varun Baranwal Used Work Cycle Mechanic Left Mnc Job Upsc Secured Air 32 , Varu-TeluguStop.com

వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.తన టాలెంట్ తో వరుణ్( Varun ) ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యారు.

సైకిల్ మెకానిక్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా వరుణ్ భరన్వాల్ ఎదిగిన తీరు ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.

వరుణ్ 15 సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు.తండ్రి మరణంతో వరుణ్ కెరీర్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.15 సంవత్సరాల వయస్సులోనే వరుణ్ పై ఆర్థిక భారం పడింది.23 సంవత్సరాల వయస్సులోనే వరుణ్ ఐఏఎస్( IAS ) గా తన లక్ష్యాన్ని సాధించి ఎంతోమంది ఆకట్టుకున్నారు.ఒకప్పుడు తినడానికి తిండి లేక పూట గడవని పరిస్థితులను వరుణ్ ఎదుర్కొన్నారని సమాచారం.

Telugu Baiser, Maharashtra, Upsc, Varun Bharanwal-Latest News - Telugu

తనకు ఎదురైన ఇబ్బందుల వల్ల కొన్ని సందర్భాల్లో చదువుకు గుడ్ బై చెప్పాలని వరుణ్ ఫీలయ్యారు.వరుణ్ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్లు వరుణ్ చదువుకోవడానికి తన వంతు సహాయం చేశారు.మహారాష్ట్ర రాష్ట్రంలోని బైసర్( Baiser , Maharashtra ) ప్రాంతానికి చెందిన వరుణ్ బాల్యంలో డాక్టర్ కావాలని అనుకున్నారు.వరుణ్ పది పరీక్షలు రాసిన సమయంలో తండ్రి మరణించారు.

పది పరీక్షల్లో టాపర్ గా నిలిచిన వరుణ్ కాలేజ్ ఫీజు పది వేలు కట్టలేక బిజినెస్ పై దృష్టి పెట్టారు.

Telugu Baiser, Maharashtra, Upsc, Varun Bharanwal-Latest News - Telugu

ఒక డాక్టర్ వరుణ్ చదువుకు సహాయం అందించారు.2012 సంవత్సరం వరుణ్ కు డెలాయిట్ కంపెనీలో( Deloitte Company ) ఉద్యోగం వచ్చింది.ఉద్యోగం వదిలి వరుణ్ సివిల్స్ పై దృష్టి పెట్టగా ఉద్యోగం వదిలేయడంతో పుస్తకాలు కొనడానికి కూడా వరుణ్ కు ఇబ్బందులు ఎదురు కాగా ఒక ఎన్జీవో అతనికి సహాయం అందించింది.2016 సంవత్సరంలో వెలువడిన ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 32వ ర్యాంక్ ను సాధించి వరుణ్ తన సక్సెస్ స్టోరీతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube