తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ వర్షిణి( Varshini Sounderajan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర పై ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇక అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
కాగా పటాస్ షో( Patas show ) ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన వర్షిణి ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు వెబ్ సీరిస్ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది.బుల్లితెర పై పటాస్, జబర్దస్త్, ఢీ షోలతో పాటు మరికొన్ని షోలకు యాంకర్ గా వ్యవహారించింది.ఇది ఇలా ఉంటే గతంలో ఇప్పటికే ఎన్నో సార్లు వర్షిణి పెళ్లికి సంబందించి ఎన్నో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా హైపర్ ఆదితో పెళ్లి అంటూ చాలా సార్లు వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఈ విషయంపై వర్షిణి స్పందించింది.
తాజాగా అభిమానులతో వర్షిణి ముచ్చటించగా, అందులోనూ అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.హైపర్ ఆదితో పెళ్లి ఎప్పుడూ అని ప్రశ్నించారు.దీంతో తాజాగా దీనిపై వర్షిణి క్లారిటీ ఇచ్చింది.
ఏదైతే రూమర్స్ వస్తున్నాయో అవన్నీ నిజం కాదని, అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పింది.వాటిలో ఏ మాత్రం నిజం లేదని, అలాంటి ఆలోచలే లేదని తెలిపింది వర్షిణి.
హైపర్ ఆది పేరు చెప్పకుండానే అసలు విషయం చెప్పింది.దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపింది.
మొత్తానికి తమ మధ్య ఏమీ లేదని తేల్చేసింది ఈ హాట్ యాంకర్ వర్షిణి.