ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలలో వనితా విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) ఒకరు.మళ్లీ పెళ్లి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వనిత తనకు మూడో పెళ్లి జరిగిందని వైరల్ అయిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే వనితా విజయ్ కుమార్ కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.హీరోయిన్ గా వనిత కూతురు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారని తెలుస్తోంది.
వనితా విజయ్ కుమార్ కూతురు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.వనిత పోలికలతోనే ఉన్న కూతురు సినిమాల్లో సక్సెస్ కావడం సులువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వనిత కూతురు పేరు జోవిక( Jovica ) కాగా జోవిక తాజాగా 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం గమనార్హం.వనితకు ఒక కొడుకు, ఒక కూతురు ఉండగా కూతురు జోవికకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉందని తెలుస్తోంది.
జోవిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోయిన్లకు( star heroines ) గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వనితా విజయ్ కుమార్ సైతం జోవిక సినీ ఎంట్రీ గురించి ఇదే తరహా కామెంట్లు చేశారు.నా కూతురు సినిమాలలో నటిస్తుందని ఇప్పటికే కొన్ని కథలు వింటున్నామని ఆమె తెలిపారు.జోవిక హీరోయిన్ గా చేయాలా? లేక కీ రోల్ లో నటించాలా? అని ఆలోచిస్తున్నామని వనిత పేర్కొన్నారు.
జోవిక నటించే సినిమాలో హీరో కంటే కథ విషయంలో ప్రధానంగా శ్రద్ధ పెట్టనున్నామని వనిత చెప్పుకొచ్చారు.జోవిక సినీ ఎంట్రీ గురించి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఆమె అన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా జోవిక దృష్టి పెడతారేమో చూడాల్సి ఉంది.జోవికకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.