తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.( Jr NTR ) వాళ్ళ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి నటవరసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.
ముఖ్యంగా మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ఆయన్ని మించిన హీరో మరొకరు లేరు అనేంతలా క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర( Devara ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రెండు పార్టు లుగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లిమ్స్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో బీభత్సమైన హైప్ ను క్రియేట్ చేసింది.
ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందు ఎన్టీయార్ కొరటాల శివతో చేసిన జనతా గ్యారేజ్ ( Janatha Garage ) సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది.ఎన్టీఆర్ మోహన్ లాల్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా సూపర్ సక్సెస్ అయింది.
ఇక ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) నటించాడు.అయితే ఆ పాత్రలో ఒక సీనియర్ నటుడిని అడిగినట్టుగా సమాచారం.
ఇక అప్పట్లో హీరోగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వడ్డే నవీన్ ని( Vadde Naveen ) రాజీవ్ కనకాల పాత్ర కోసం అడిగారట.కానీ నవీన్ మాత్రం దానికి నో చెప్పడంతో రాజీవ్ కనకాల ఆ పాత్రలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే జనతా గ్యారేజ్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఒక అదిరిపోయే సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి…ఇక అదే హిట్ ట్రాక్ ను రిపీట్ చేస్తూ మళ్ళీ వీళ్ళ కాంబో లో ఒక సూపర్ హిట్ కొట్టడానికి దేవర సినిమాతో మన ముందుకు వస్తున్నారు…
.