తెలంగాణలో త్వ‌ర‌లోనే రేష‌న్ డీల‌ర్ల ఖాళీలు భ‌ర్తీ చేస్తున్నట్లు వెల్లడించిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి.. !

తెలంగాణ రాష్ట్రంలో రేష‌న్ డీల‌ర్ల భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా త్వరలో ఈ ఖాళీలను పూర్తిచేస్తామని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వెల్లడించారు.

 Vacancies Of Ration Dealers Will Be Filled Soon Telangana, Minister Gangula Kama-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈరోజు రేష‌న్ డీల‌ర్ల అసోసియేష‌న్‌, ఉన్న‌తాధికారుల‌తో ఉచిత బియ్యం పంపిణీపై స‌మీక్ష నిర్వహించిన క్రమంలో గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ క‌రోనా సమయంలో పేద‌ల‌కు స‌త్వ‌ర‌మే రేషన్ బియ్యం అందేలా ఏర్పాట్లు చేయాల‌ని, ఈ విషయంలో రేష‌న్ డీల‌ర్లు చొరవ చూపించాలని, అధికారుల‌కు ఆదేశాలిచ్చారు.ఇకపోతే ఇప్పటి వరకు రేష‌న్ డీల‌ర్లకు ఇవ్వవలసిన పాత బ‌కాయిలు రూ.56.7 కోట్లు విడుద‌ల చేస్తున్నామ‌ని వెల్లడించారు.కాగా జూన్‌, జూలై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల రేషన్‌ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇక పనిలో పనిగా రేషన్ డీలర్ల అక్రమాల పై కుడా ఓ కన్నేస్తే బాగుంటుందని ప్రజలు ముచ్చటించుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube