తెలంగాణలో త్వరలోనే రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించిన పౌరసరఫరాల శాఖ మంత్రి.. !
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్ల భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా త్వరలో ఈ ఖాళీలను పూర్తిచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఈ నేపధ్యంలో ఈరోజు రేషన్ డీలర్ల అసోసియేషన్, ఉన్నతాధికారులతో ఉచిత బియ్యం పంపిణీపై సమీక్ష నిర్వహించిన క్రమంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరోనా సమయంలో పేదలకు సత్వరమే రేషన్ బియ్యం అందేలా ఏర్పాట్లు చేయాలని, ఈ విషయంలో రేషన్ డీలర్లు చొరవ చూపించాలని, అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇకపోతే ఇప్పటి వరకు రేషన్ డీలర్లకు ఇవ్వవలసిన పాత బకాయిలు రూ.56.
7 కోట్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.కాగా జూన్, జూలై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇక పనిలో పనిగా రేషన్ డీలర్ల అక్రమాల పై కుడా ఓ కన్నేస్తే బాగుంటుందని ప్రజలు ముచ్చటించుకుంటున్నారట.
విడాకులు అయినా తనను వదలను.. ప్రభుదేవా మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు వైరల్!