విధి నిర్వహణలో ప్రాణత్యాగం: సిక్కు పోలీస్ అధికారికి యూఎస్ సెనేట్ ఘన నివాళి

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత సంతతికి చెందిన సిక్కు పోలీస్ అధికారి సందీప్ సింగ్ ధలివాల్‌కు అమెరికాలో మరో గౌరవం దక్కింది.అక్కడి ఓ పోస్టాఫీస్‌కు ప్రభుత్వం ఆయన పేరు పెట్టనుంది.

 Us Senate Passes Bill To Name Post Office After Slain Sikh Police , Officer Sand-TeluguStop.com

హూస్టన్‌లోని 315 హాడిక్స్ హావెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీస్‌కు ‘‘ డిప్యూటీ సందీప్ సింగ్ ధలీవాల్ పోస్టాఫీస్ బిల్డింగ్’’ అని పేరు పెట్టాలని అమెరికా ప్రతినిధుల సభ గత సెప్టెంబర్‌లో చట్టాన్ని రూపొందించింది.తాజాగా దీనికి అమెరికన్ సెనేట్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుతం దీనిని అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం కోసం వైట్‌హౌస్‌కు పంపారు.ఇది చట్టంగా రూపుదిద్దుకుంటే అమెరికాలో భారత సంతతి వ్యక్తి పేరుతో ఉన్న రెండో పోస్టాఫీస్‌గా గుర్తింపు పొందనుంది.

2006లో దక్షిణ కాలిఫోర్నియాలో కాంగ్రెస్‌ సభ్యుడు భారత అమెరికెన్‌ దలీప్‌ సింగ్‌ సౌండ్‌ పేరు పెట్టారు.టెక్సాస్‌లోని కాస్ట్రోవిల్లేలో ఉన్న మరో యూఎస్‌ ఆఫీసును ‘లాన్స్‌ కార్పోరల్‌ రొనాల్డ్‌ డైన్‌ రైర్డాన్‌ పోస్టాఫీస్‌’గా మార్చారు.

Telugu American Senate, Beltway Tollway, Deputysandeep, Sandeep Singh-Telugu NRI

హూస్టన్‌లోని హరీస్ కౌంటీ డిప్యూటీ పోలీస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన 42 ఏళ్ల సందీప్ సింగ్ గతేడాది సెప్టెంబర్‌లో ఓ దుండగుడిలో చేతిలో కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే.ఓ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో అతడ్ని ఆయన ఆపారు.అంతే… సదరు వ్యక్తి కారులో నుంచి దిగి ధలివాల్‌పై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు.దాంతో ధలివాల్ అక్కడికక్కడే చనిపోయారు.

కాగా, నిందితుడికి ఈ కేసులో అక్కడి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.వృత్తి పట్ల ధలివాల్ అంకితభావం, త్యాగానికి గుర్తింపుగా కొద్దిరోజుల క్రితం అక్కడి ‘బెల్ట్‌వే 8 టోల్‌వే‘లో కొంత భాగానికి ఆయన పేరు పెట్టిన సంగతి తెలిసిందే.‘హెచ్‌సీఎస్ఓ డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ మెమోరియల్ టోల్‌వే’గా నామాకరణం చేశారు.10వేలకు పైగా సిక్కులు ఉండే హారిస్ కౌంటీలో తలపాగా, గడ్డంతో విధులు నిర్వహించిన తొలి సిక్కు వ్యక్తిగా ధలివాల్ వార్తల్లో నిలిచారు.ఆయన పదేళ్ల పాటు అమెరికన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొనసాగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube