అమానుషం: కన్న కూతురిని 36 ఏళ్లుగా గృహ నిర్బంధం చేసిన కర్కశ తండ్రి.. ఎక్కడంటే?

అమెకొచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు.దాదాపు 36 ఏళ్లు ఇంట్లోనే మగ్గిపోయింది.

 Up Woman Chained In A Narrow Room By Her Father Past 36 Years Details, Father ,-TeluguStop.com

కన్న తండ్రి కారణంగా ఆమె సొంత ఇంట్లోనే జీవితఖైదు అనుభవించింది.కాగా నేటికి ఆమెకు 53 సంవ‌త్స‌రాలు.

ఆమె తన సగ జీవితం సూర్య‌ర‌శ్మి, స్వ‌చ్ఛ‌మైన గాలి లేకుండానే గ‌డిపేసింది.ఈ విష‌యం తెలుసుకున్న మాజీ మేయ‌ర్, స్థానిక ఎమ్మెల్యే, ఓ ఎన్జీవో క‌లిసి ఆమెకు తాజాగా ఆ చెరనుండి విముక్తి క‌ల్పించారు.

వివరాల్లోకి వెళితే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ తుండ్లా ప్రాంతం సమీపంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ళ సప్నా జైన్ కు మాన‌సిక ఆరోగ్యం స‌రిగా ఉండ‌దు అనే కార‌ణంతో కన్న తండ్రి 36 ఏళ్ల కింద‌ట ఓ గ‌దిలో గొలుసుల‌తో బంధించారు.కాగా బాధితురాలి వయస్సు అప్పటికి 17 సంవత్సరాలు.

ఆహారం కూడా ఆమెకు నేరుగా కాకుండా త‌లుపు కింది నుంచి పంపించేవారు.అలా అక్కడ తింటూనే మ‌ల మూత్ర విస‌ర్జ‌న కూడా అక్కడే చేసేది.

స్నానం విషయానికొస్తే కిటికిలో నుంచి నీళ్లు పోస్తూ చేయించేవారు.

అలా ఆమె జీవితం 36 ఏళ్లు అలాగే గడిచిపోయింది.

Telugu Cruel, Firozabad, Latest, Narrow, Sapna Jain-Latest News - Telugu

ఇకపోతే సప్నా తండ్రి గిరీష్ చంద్ తాజాగా మరణించారు.ఆ స‌మ‌యంలో స్థానిక స్వచ్ఛంద సేవా భారతి సభ్యులు ఆమె ఇంటికి వెళ్లగా అక్క‌డ బాధితురాలి ప‌రిస్థితిని చూసి తీవ్రంగా చ‌లించిపోయారు.ఆమె చుట్టూ మురికి పేరుక‌పోయి, దారుణమైన దీనావస్థితిలో వుంది.ఉంది.వెంటనే సేవా సంస్థ‌లోని మ‌హిళా బృందం ఆమెకు స్నానం చేసి, కొత్త బ‌ట్ట‌లు తొడిగారు.బాధితురాలి ప‌రిస్థితిని ఆగ్రా మాజీ మేయర్, హత్రాస్క్ చెందిన బీజేపీ ఎమ్మెల్యే అంజులా మహౌర్ కు తెలియ‌జేశారు.

దీంతో వారు అధికారుల‌తో క‌లిసి వ‌చ్చి ఆమెకు విముక్తి క‌ల్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube