అప్ప‌టి దాకా స్నేహం.. అంత‌లోనే వైరం.. అంత‌మంది ఇలా కొట్టుకున్నారేంటి..!

స్నేహాన్ని మించిన మంచి బంధం లేద‌ని చెప్తుంటారు.కాగా స్నేహం అంటే ఇలాగే ఉండాలేమో అనేంత‌లా కూడా చాలామంది ఆద‌ర్శంగా నిలిచారు.

 Until Then, Friendship  Fight In The End Why Did So Many People Get Hit Like Thi-TeluguStop.com

కానీ ఇంకొంద‌రిని చూస్తుంటే మాత్రం చిన్న చిన్న కార‌ణాల‌కే విడిపోతుంటారు.అలాంటి వారు స్నేహానికే మ‌చ్చ తీసుకొస్తున్నార‌నే చెప్పాలి.

ఇక స్నేహితుల మ‌ధ్య వ‌చ్చే గొడ‌వ‌లు మాత్రం చాలా సిల్లీగానే ఉంటాయ‌ని చెప్పాలి.ఇక ఇప్పుడు కూడా ఓ మంచి స్నేహితుల మ‌ధ్య కేవ‌లం ఈత సరదా అనేది పెద్ద చిచ్చే రేపింది.

ఏకంగా ఆ స్నేహితులంతా రెండు వర్గాలుగా విడిపోయి మ‌రీ కొట్టుకునే వ‌ర‌కు తీసుకొచ్చింది.

ఇక ఈ దాడిలో ఏకంగా ముగ్గురు గాయపడగా అందులో ఒక యువకుడు హాస్పిట‌ల్‌కు వెళ్లేదాకా వ‌చ్చింది.

ఇక గ‌త ఆదివారం ఫ్రెండ్‌షిఫ్‌ డే సంద‌ర్భంగా కిలేశ‌పురానికి చెందిన కొంద‌రు స్నేహితులు ఎంజాయ్ చేయ‌డానికి స్థానికంగా ఉండే జ‌ల‌పాతం ద‌గ్గుర‌కు వ‌చ్చారు.కాగా ఇలా వ‌స్తున్న క్ర‌మంలో బైక్‌ల మీద ఉండ‌గానే గొడవ ప్రారంభమైంది.

ఇక అప్పటికే మ‌ద్యం సేవించి ఉన్న వారంతా వివాదాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు.ఒక‌రిపై ఒక‌రు క‌ర్ర‌లు, రాళ్లుతో దాడి చేసుకునే వ‌ర‌కు వ‌చ్చారు.

ఇక చిన్న చిన్న మాట‌లే వారి మ‌ధ్య ఇలా గొడ‌వ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

కిలేశపురంలో ఈ స్నేహితులు గ‌తంలో చేసిన ప‌నులు కూడా ఇలాగే స్థానికుల‌కు తీవ్ర ఇబ్బందులు తీసుకువ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మాత్రం కేవ‌లం ఈత కొట్టేందుకు వ‌స్తున్న స‌మ‌యంలో చిన్న మాట‌లు పెద్ద గొడ‌వ‌కు దారి తీసిన‌ట్టు తెలుస్తోంది.ఇదే విష‌యంలో ఏకంగా కేసులు పెట్టే వ‌ర‌కు ఘర్షణ జరిగింది.

ఇక ఈ కేసులో ఇప్పటికే 10 మంది స్నేహితుల‌ను అరెస్టు చేసిన‌ట్టు స్థానిక సీఐ వివ‌రించారు.మొత్తానికి ఇలా స్నేహితులు చిన్న దానికే కొట్టుకున్నార‌న్న‌మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube