బొప్పాయి, దానిమ్మ క‌లిపి ఇలా తీసుకుంటే మ‌స్తు ఆరోగ్య లాభాలు!

బొప్పాయి, దానిమ్మ. ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మరియు రుచికరమైన పండ్లలో ఇవి రెండు ముందు వరుసలో ఉంటాయి.

 Taking Papaya And Pomegranate Together Will Give You Great Health Benefits!,papa-TeluguStop.com

ఇందులో ఎటువంటి సందేహం లేదు.పోషకాల పరంగా కూడా బొప్పాయి మరియు దానిమ్మ పండ్లు వాటికవే సాటి.

అందుకే ఈ పండ్ల‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.అయితే బొప్పాయి, దానిమ్మ పండ్లను విడి విడిగానే కాదు కలిపి కూడా తీసుకోవచ్చు.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా బొప్పాయి, దానిమ్మ పండ్లను తీసుకుంటే మస్తు ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం బొప్పాయి దానిమ్మ కలిపి ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం పదండి.

ఒక కప్పు బొప్పాయి ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి.అలాగే ఒక దానిమ్మ పండును తీసుకుని తొక్క తొలగించి లోపల ఉండే గింజలను వేరు చేయాలి.

చివరిగా ఒక చిన్న క్యారెట్ ను తీసుకుని పీల్ తొల‌గించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Papaya, Papaya Benefits, Pomegranate-Telugu Health Tips

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, క్యారెట్ ముక్కలు, దానిమ్మ గింజలు, రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేసి సేవించాలి.వారంలో కనీసం మూడు సార్లు ఈ బొప్పాయి దానిమ్మ జ్యూస్‌ను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

తద్వారా రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.కంటి చూపు మెరుగుపడుతుంది.

రోగ నిరోధక వ్యవస్థ బ‌ల‌పడుతుంది.సీజ‌నల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

మరియు మెదడు మునుప‌టి కంటే చురుగ్గా సైతం పని చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube