జొమాటో డెలివరీ బాయ్‌కు ఊహించని స్వాగతం.. ఫుడ్ డెలివరీకి వెళ్లగానే జరిగిందిలా..

డిజిటల్ వాడకం పెరిగాక ఇప్పుడు అందరూ ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ చేసే సర్వీస్‌లపై ఆధార పడుతున్నారు.బాగా ఆకలి అయినా పదినిమిషాల్లో ఈ కంపెనీలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి కాబట్టి వంట చేసుకోవడం కుదరని వారు సైతం వీటిపైన అధికంగా ఆధారపడుతున్నారు.

 Unexpected Welcome To Zomato Delivery Boy Pizza Delivery Boy, Zomato Delivery Bo-TeluguStop.com

అయితే ఒక్కోసారి డెలివరీ లేట్ అయినప్పుడు కస్టమర్లు ఆకలి మంటలతో చాలా ఇబ్బంది పడతారు.డెలివరీ బాయ్స్‌పై కూడా మండిపడుతున్నారు.

కాగా, తాజాగా ఫుడ్‌ను గంట లేటుగా తెచ్చిన డెలివరీ బాయ్‌కు ఓ కస్టమర్‌ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.అతడు చేసిన పనికి ఆ డెలివరీ ఏజెంట్ అవాక్కయ్యాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.ఢిల్లీలో రీసెంట్‌గా కుండపోత వర్షాలు కురిశాయి.

ఈ సమయంలోనే ఒక వ్యక్తి జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.దానిని జొమాటో బాయ్‌ ఓ గంట ఆలస్యంగా డెలివరీ చేసాడు.

అయితే డెలివరీ ఇస్తున్న సమయంలో ఆ కస్టమర్ తన చేతిలో పళ్లెం పట్టుకొని డెలివరీ బాయ్‌ నుదుట బొట్టు పెట్టి హారతి ఇస్తూ అతడికి షాక్ ఇచ్చాడు.అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో తెలియక ఆ డెలివరీ బాయ్ బిక్కమొహం వేసాడు.

ఒకవైపు వర్షం.మరోవైపు ఫెస్టివల్ సీజన్ కావడంతో ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నా సరే గంట పాటు ప్రయాణం చేసి ఫుడ్ డెలివరీ చేసిన ఇతడిని మెచ్చుకుంటూ ఈ కస్టమర్ ఇలా చేశాడట.

ఆలస్యంగా తెచ్చినందుకు తిట్ల అక్షింతలు వేస్తారనుకుంటే నిజంగానే హారతిచ్చి అసలైన అక్షింతలు వేశారు కదా అంటూ ఈ కష్టమర్‌ని నెటిజన్లు పొగుడుతున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube