సన్సేష‌న‌ల్ దర్శకుడు మారుతి చేతుల మీదుగా విడుదలైన '1996 ధర్మపురి' సినిమా ట్రైలర్ పై అనూహ్య స్పందన

భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 1996 ధర్మపురి.తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.

 Unexpected Reaction On The 1996 Dharmapuri Movie Trailer , 1996 Dharmapuri Movie-TeluguStop.com

టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు.గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి.1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రముఖ దర్శకుడు మారుతి గారు ఆయ‌న చేతుల మీదుగా విడుదల‌చేశారు.దీనికి అనూహ్య స్పందన వస్తుంది.రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.బీడీలు చుట్టే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ 1996 ధర్మపురి.

అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కించారు .ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు.ఓషో వెంకట్ సంగీతం ఆందించిన‌ 1996 ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్.

ఈరోజు విడుద‌ల చేసిన ట్రైల‌ర్ లో డైలాగ్స్ అంద‌ర్ని ఆక‌ట్ట‌కుంటున్నాయి.ఒక పొరి చుట్టూ ఒక పోర‌డు వెంట‌బ‌డుతుంటే ఆ పొరి కచ్చే వజనే వేరు.

నాకు ఈ ప్రేమ గీమ తెల్వ‌దు న‌చ్చినోడ్ని క‌ట్టుకునుటే తెలుసు నాకు న‌చ్చినావురా దొంగ‌బాడ‌వావ్‌.ట్రైల‌ర్ ఎండింగ్ లో వ‌చ్చే హీరోయిన్ డైలాగ్ ఫైర్ పుట్టించింది.ఇలాంటి ముచ్చ‌ట్లు ఈ సినిమా లో చాలా వున్నాయంటున్నాడు ద‌ర్శ‌కుడు జ‌గ‌త్‌

Telugu Dharmapuri, Akhandanaga, Aparna Devi, Bollywood, Jagat, Gagan Vihari, Jay

మారుతి గారు మాట్లాడుతూ.1996 ధ‌ర్మ‌పురి చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ నా ద‌గ్గ‌ర చాలా చిత్రాలకి సహ ద‌ర్శ‌కుడు గా చేశాడు.మొట్ట‌మొద‌టి సారిగా ఈ చిత్రం తో ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం అవుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.అలాగే ఈ చిత్రానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్ప‌ణ చేయ‌డం మా జగత్ కి చాలా హెల్ప్ అయ్యింది.

నేను 1996 ధ‌ర్మ‌పురి చిత్రాన్ని చూశాను.ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్ గా నేచుర‌ల్ గా తీసారు.

లీడ్ కేర‌క్ట‌ర్స్ చేసిన న‌టీన‌టులు చాలా బాగా చేశారు.ఈ చిత్రం చూసేవారు థ్రిల్ పీల‌వుతారు.

ఓషో వెంక‌టేష్ గారు సంగీతం చాలా బాగుంది.సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రం లో డైలాగ్స్ బాగా ఆక‌ట్ట‌కుంటాయి.ఈరోజు నా చేతుల మీదుగా విడుద‌ల‌య్యిన ట్రైల‌ర్ నాకు బాగా న‌చ్చింది.

అంద‌రికి న‌చ్చుతుంద‌ని న‌మ్ముతున్నాను.అని అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ క‌థ చెప్పిన‌రోజే చెప్పాను ఈ సినిమా అంద‌రి హ్రుద‌యాల‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని, అందుకే నేను ఈ చిత్రం లో పార్ట‌య్యాను.

ఈరోజు సినిమా చూసిన మారుతి గారు లాంటి ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడ న‌చ్చ‌డం అంటే తెలుగు ప్రేక్ష‌కులంద‌రి న‌చ్చుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను.ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్ గా చాలా నేచుర‌ల్ ఫెర్‌ఫార్మెన్స్ తో ప్ర‌తి ఓక్క‌ర్ని ఆక‌ట్టుకుంటుంది.

ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాసారు.సాంగ్స్ విష‌యానికోస్తే ఇప్ప‌టికే రెండు సాంగ్స్ ప్రేక్ష‌కుల్లో వున్నాయి.

హీరో హీరోయిన్ప్ అని కాకుండా కేర‌క్ట‌ర్స్ లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు.సినిమా ఎండ్ కార్డ్ ప‌డ్డాక సూరి, మ‌ల్లి పాత్ర‌లు మీతోనే ధియేట‌ర్ బ‌య‌ట‌కి ట్రావెల్ అవుతాయి.

ఓషో వెంక‌టేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది.ఏప్రిల్ 22 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.

అని అన్నారు

నటీనటులు: గగన్ విహారి, అపర్ణ దేవి, అఖండ నాగ మహేష్, పలాస జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని, జయప్రద, మధుమిత,శంకర్ తదితరులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube