రాజీలేని పోరాటం పవన్ కు కలిసి వస్తుందా ?

వాలంటీర్ వ్యవస్థ పై ఏలూరు వారాహి యాత్ర కేంద్రంగా పవన్ కళ్యాణ్( Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు వేదిక అయింది, తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా రకరకాల పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.వీటి వెనుక అధికార వైసిపి పార్టీ ఉన్నదని, కొంతమంది పెయిడ్ మెంబర్స్ తో వైసీపీ నే వెనకనుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, అనధికారిక ఆర్డర్స్ ద్వారా వాలంటీర్ల పై ధర్నా చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, జన సైనికులు ఆరోపిస్తున్నారు.

 Uncompromising Fight Come Together For Pawan , Pawan Klayan., Varahi Yatra , Ap-TeluguStop.com

ఏది ఏమైనా వాలంటీర్ వ్యవస్థ తమ రాజకీయ విజయానికి అడ్డంకి అని జనసేన అధ్యక్షుడు నమ్ముతున్నట్లుగా మాత్రం స్పష్టం అవుతుంది.

Telugu Ap, Jana Sena, Pawan Klayan, Varahi Yatra, Volunteers, Ys Jagan-Telugu Po

పూర్తిస్థాయి డేటాని మైక్రో లెవెల్ కి వెళ్లి సేకరిస్తున్న వాలంటీర్లు తమకు తెలియకుండానే ప్రజల మీద కంట్రోల్ ను అధికార పార్టీకి అప్పజెపుతున్నారని, ఈ లింక్ తేగ్గొట్టకపోతే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడం సాధ్యం కాదని నమ్ముతున్న పవన్ దీనిపై రాజీలేని పోరాటం చేసేందుకే సిద్ధమయ్యారు.తన వ్యాఖ్యల వల్ల కొంత నష్టం జరుగుతుందని , ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై పోయిన వాలంటీర్ల మీద విమర్శలు సామాన్య జనంలో కొంత వ్యతిరేకత తీసుకొస్తుందని తెలిసినా కూడా పవన్ ముందుకే వెళ్ళటానికి సిద్ధమయ్యారు.డేటా ప్రైవసీ ( Data Privacy )అన్నది ప్రజాస్వామ్య హక్కు అని ఇలా సంక్షేమ పథకాల పేర్లతో వారి వివరాలు మొత్తం వాలంటీర్ల చేతిలో పెట్టడం ద్వారా ప్రజల భద్రత పరంగానూ మంచిది కాదని వాదిస్తున్న పవన్ ఈ వ్యవస్థపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Jana Sena, Pawan Klayan, Varahi Yatra, Volunteers, Ys Jagan-Telugu Po

అమాయకులైన వాలంటీర్లను తాను ఏమీ అనడం లేదని వాలంటీర్ల ముసుగులో సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్న ఉదాహరణలు రోజువారి పేపర్లో మనం అనేకం చూస్తున్నామని నేను అలాంటి వారిని ఉద్దేశించే మాట్లాడుతున్నానని, అంతేకాకుండా ఏ రకమైన అధికారిక కట్టుబాటు లేనటువంటి వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పవన్ బల్లగుద్ది వాదిస్తున్నారు.

మరి ఈ మరి ఈ మొత్తం ప్రాసెస్ లో వాలంటీర్ వ్యవస్థ( Volunteers ) పై పోరాటంలో పవన్ గెలుస్తారో ఓడుతారో తెలియదు కానీ పూర్తిస్థాయి చర్చ జరిగేలా మాత్రం పవన్ ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube