'బ్రో' సెకండ్ సాంగ్ అప్డేట్.. డేట్ అండ్ టైం లాక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”( Brow the Avatar ).ఈ జులై లోనే రాబోతున్న ఈ మెగా మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Second Single From Bro Will Be Out On This Date, Jaanavule, Sai Dharam Tej, Priy-TeluguStop.com

ఈ సినిమాపై వరుస అప్డేట్ లను అందిస్తూ మెగా ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నారు.దీంతో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెర మీద చూస్తామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జస్ట్ గెస్ట్ రోల్ లో నటించినప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ సైతం మంచి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.సముద్రఖని ( samudrakhani )డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.కాగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

థమన్( Thaman ) సంగీతం అందించిన ఈ సినిమా నుండి ఇప్పటికే మ్యూజికల్ పరంగా ఒక సాంగ్ ను రిలీజ్ చేయగా అది పర్వాలేదు అనిపించింది.పెద్దగా ఆకట్టుకోలేక పోయిన పవర్ స్టార్ కనిపించడంతో ఈ సాంగ్ ను బాగానే ఆదరిస్తున్నారు.ఇక మేకర్స్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేయగా ఇప్పుడు సెకండ్ సాంగ్ అప్డేట్ ను ఇచ్చారు.

ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ గా జాణవులే అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.ఈ సాంగ్ ను జులై 15న రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ తో ప్రకటించారు.

ఈ పోస్టర్ లో ఆకట్టుకోగా ఈ సాంగ్ అయిన బాగా అలరించి చార్ట్ బస్టర్ గా నిలుస్తుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube