ఆ విషయాలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు మరే హీరో సాటి రారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని కోట్ల సంఖ్యలో అభిమానులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Ntr )ను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు సైతం తమ ఫేవరెట్ హీరో ఎవరనే ప్రశ్నకు ఎన్టీఆర్ పేరు సమాధానంగా చెబుతున్నారు.

 Young Tiger Junior Ntr Great In That Matter Details Here Goes Viral , Ntr, Tolly-TeluguStop.com

అయితే సినిమా ఇండస్ట్రీలో సింగిల్ టేక్ హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పేరుంది.సీన్ అయినా, డ్యాన్స్ అయినా సింగిల్ టేక్ లో ఈ స్టార్ హీరో పూర్తి చేస్తాడట.

చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మరో టేక్ అవసరం అవుతుందని తెలుస్తోంది.చాలామంది హీరోలు, హీరోయిన్లు ముందుగానే తమ సీన్లను ప్రిపేర్ అయ్యి సింగిల్ టేక్ లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఒకసారి సీన్ పేపర్ ను చదివి డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగుతారని సమాచారం అందుతోంది.ఏ మాత్రం ప్రాక్టీస్ చేయకుండా తన స్కిల్స్ తో జూనియర్ ఎన్టీఆర్ మెప్పిస్తున్నారని భోగట్టా.

Telugu Harishshankar, Ntr, Rajamouli, Tollywood-Movie

కనురెప్పలతో సైతం మనస్సులోని భావాలను అద్భుతంగా పలికించే అతికొద్ది మంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం గమనార్హం.జక్కన్న( S.S.Rajamouli ) లాంటి స్టార్ డైరెక్టర్ ఒక సందర్భంలో తను ఏ సీన్ ఇచ్చినా దానికి 100కు 100 శాతం న్యాయం చేసే హీరో తారక్ అని చెప్పారంటే తారక్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో అర్థమవుతుంది.స్టార్ డైరెక్టర్లలో ఒకరైన హరీష్ శంకర్ ( HarishShankar )యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుడతాడా? అని కామెంట్ చేయడం గమనార్హం.

Telugu Harishshankar, Ntr, Rajamouli, Tollywood-Movie

ఎంత కఠినమైన పాత్ర ఇచ్చినా పోషించే ప్రతిభ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ అని రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం రెగ్యులర్, కమర్షియల్ పాత్రలు కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటగల ప్రాజెక్ట్ లకు మాత్రమే ఓకే చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube